Arjun Suravaram
YSRCP Siddam: వైఎస్సార్ సీపీ సిద్ధం పేరుతో ఎన్నికల సమరంలోకి దిగిన సంగతి తెలిసింది. భీమిలి నుంచి సిద్ధం పేరుతో ఎన్నికల రణరంగంలోకి దిగారు. ఇప్పటికే మూడు సిద్ధం సభలు జరగ్గా..సూపర్ సక్సెస్ అయ్యాయి. తాజాగా నాలుగో సిద్ధం సభకు ఖరారు అయ్యింది.
YSRCP Siddam: వైఎస్సార్ సీపీ సిద్ధం పేరుతో ఎన్నికల సమరంలోకి దిగిన సంగతి తెలిసింది. భీమిలి నుంచి సిద్ధం పేరుతో ఎన్నికల రణరంగంలోకి దిగారు. ఇప్పటికే మూడు సిద్ధం సభలు జరగ్గా..సూపర్ సక్సెస్ అయ్యాయి. తాజాగా నాలుగో సిద్ధం సభకు ఖరారు అయ్యింది.
Arjun Suravaram
‘సిద్ధం’.. ఈ పేరు వింటేనే టీడీపీ, జనసేన పార్టీల్లో వణుకుపుడుతుందని పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోన్న టాక్. అధికార వైఎస్సార్ సీపీ సిద్ధం పేరుతో ఎన్నికల సమరంలోకి దిగిన సంగతి తెలింది. భీమిలి నుంచి సిద్ధం పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమర శంఖరావాన్ని పూరించారు. ఇప్పటికే మూడు సభలు నిర్వహించింగా..జన సునామీని తలపించాయి. ఈ మూడు సభలు సూపర్ సక్సెస్ కావడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. నాలుగో సభ ఎక్కడ అనే దానిపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్ధం నాలుగో సభ ఖరారు అయింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ సీపీ వ్యూహాలు రచిస్తోంది. అలానే ప్రత్యర్థి పార్టీలు టీడీపీ, జనసేనలు సైతం వైసీపీ గెలుపును ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు వివిధ యాత్రల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం పక్క ప్రణాళికతో సరిగ్గా ఎన్నికలకు 100 రోజులు ముందు నుంచే ఎన్నికల క్షేత్రంలోకి దిగారు. గత నెలలో ఉత్తరాంధ్ర ప్రాంతమైన భీమిలి నియోజకవర్గం నుంచి సిద్ధం పేరుతో ఎన్నికల రణరంగంలోకి సీఎం జగన్ దిగారు. అక్కడి వచ్చిన జనం చూస్తే.. పక్కనే ఉన్న సముద్రం జనం రూపంలో సిద్ధం సభకు వచ్చిందా అనేలా మారింది. ఈ సభతో సీఎం జగన్ ప్రచారంలోకి దిగితే ఎలా ఉంటుందో ప్రతిపక్షాలకు అర్థమైంది.
అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన సిద్ధం రెండో సభకు తొలి సభ స్థాయిలోనే జరిగింది. ఇక రాయలసీమ చరిత్రలోనే ఎన్నడు చూడని విధంగా రాప్తాడులో సిద్ధం మూడో సభ జరిగింది. సముద్రానికి పోటీగా రాప్తాడుకు జనం పోటెత్తారు. ఇలా వైఎస్సార్ సీపీ నిర్వహించిన మూడు సభలు దద్దరిల్లిపోయాయి. ప్రతిపక్షాలు ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని సభల జనం మొత్తం కలిపి కూడా రాప్తాడు సభకు సరిపోలేదు. ఈ క్రమంలోనే నాలుగో సిద్ధం సభకు వైసీపీ రెడీ అయ్యింది. మార్చి తొలివారంలో సిద్ధం సభతో తమ ఎన్నికల ప్రచారాన్ని దద్దరిల్లేలా ప్రకటనలు చేయడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారు. నాలుగో సిద్దం సభను పల్నాడు జిల్లాలో నిర్వహించనున్నట్టు తెలిసింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఈ సభ జరగనుంది.
విజయవాడ- చెన్నై జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ప్రాంగణంలో సభను నిర్వహించనున్నారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి ఈ సారి చిలకలూరిపేట సభ నిర్వహించేలా వైసీపీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. కంచుకోటలను బద్దలు కొట్టేలా జరుగుతోన్న సిద్ధం సభకు కీలక ప్రాంతాలను వేదికలుగా సీఎం జగన్ ఎంచుకుంటోన్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడు, చిలకలూరిపేటలో వైఎస్సార్‌సీపీ తొలిసారి మాత్రమే గెలిచింది. ఇక నాలుగో సిద్ధం సభలోనే సీఎం జగన్ కీలక ప్రకటన చేస్తారని సమాచారం. గెలుపు నినాదంతో పాటు రైతులకు, మహిళలకు సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో వైఎస్సార్‌సీపీ ప్రచారంలోకి దూసుకెళ్తోంది.