iDreamPost
android-app
ios-app

షర్మిల కొడుకు వివాహ ముహూర్తం ఫిక్స్!.. పెళ్లి జరిగేది అప్పుడేనా?

  • Published Dec 15, 2023 | 11:30 AM Updated Updated Dec 15, 2023 | 11:36 AM

YS Raja Reddy Marriage Details?: షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్లు సమాచారం. రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహానికి ముహూర్తం కూడా ఖరారైంది. వీరి పెళ్లి అప్పుడే జరగనున్నట్లు తెలుస్తోంది.

YS Raja Reddy Marriage Details?: షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్లు సమాచారం. రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహానికి ముహూర్తం కూడా ఖరారైంది. వీరి పెళ్లి అప్పుడే జరగనున్నట్లు తెలుస్తోంది.

  • Published Dec 15, 2023 | 11:30 AMUpdated Dec 15, 2023 | 11:36 AM
షర్మిల కొడుకు వివాహ ముహూర్తం ఫిక్స్!.. పెళ్లి జరిగేది అప్పుడేనా?

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇటీవల రాజారెడ్డి ప్రేమ వ్యవహారం మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. యూఎస్ లో ఉంటున్న రాజారెడ్డి, ప్రియా అట్లూరి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. గతంలో వీరిద్దరు కలిసున్న ఫోటో ఒకటి నెట్టింటా వైరల్ గా మారింది. అంతేగాక వైఎస్ విజయమ్మ ప్రియా అట్లూరికి చీర పెట్టిన ఫొటో బయటకు రావడంతో వీరి పెళ్లి కన్ఫామ్ అయినట్టైంది.

కాగా రాజారెడ్డి వివాహానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాజారెడ్డి, ప్రియాల పెళ్లికి వివాహ మూహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇరువైపుల కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పడింది. దీంతో రాజారెడ్డి, ప్రియా అట్లూరి మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వనున్నారు. అయితే రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17న జరగనున్నట్టు తెలిసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ఉమేద్‌ ప్యాలెస్ లో పెళ్లి వేడుక నిర్వహించనున్నట్లు సమాచారం. జనవరి రెండు లేదా మూడో వారంలో హైదరాబాద్‌లో నిశ్చితార్థం ఉంటుందని తెలుస్తోంది. వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బంధువులకు, ఆత్మీయులకు, స్నేహితులకు ఆహ్వానాలు కూడా పలుకుతున్నట్లు సమాచారం.

marraige date fix for sharmila son

ఇక ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లిన రాజారెడ్డి అక్కడ ప్రియా అట్లూరితో పరిచయం ఏర్పర్చుకున్నారు. కొంత కాలానికే వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇక ప్రియా అట్లూరి కూడా యూఎస్ లోనే ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కూడా చేస్తుంది. ఈమే కూడా మంచి పేరున్న కుటుంబానికి చెందిన అమ్మాయే. ప్రియా తండ్రి అట్లూరి శ్రీనివాస్ అమెరికాలో స్థిరపడ్డారు. అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ, ఎప్పుడో క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారని తెలుస్తోంది. ఇన్నాళ్లు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్‌తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుందని ప్రచారం సాగుతోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabet