iDreamPost
android-app
ios-app

హీరోలను తలపిస్తున్న షర్మిల కొడుకు.. కటౌట్ మామూలుగా లేదుగా!

  • Author singhj Published - 01:02 PM, Sat - 8 July 23
  • Author singhj Published - 01:02 PM, Sat - 8 July 23
హీరోలను తలపిస్తున్న షర్మిల కొడుకు.. కటౌట్ మామూలుగా లేదుగా!

భారతదేశం గర్వించదగ్గ గొప్ప నాయకుల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్​ రెడ్డి ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనది ఎప్పుడూ ప్రజాపక్షమే. అధికారాన్ని ప్రజల జీవితాలను బాగు చేసేందుకు ఉపయోగించిన విధానం, నిత్యం జనాలకు మంచి చేసేందుకు ఆయన తపించిన తీరును ప్రశంసించకుండా ఉండలేం. ముఖ్యంగా అన్నదాతలు, విద్యార్థుల కోసం ఆయన చేసిన కృషిని ఎవరూ మర్చిపోలేరు. రైతుల కోసం ఉచిత కరెంట్ పథకాన్ని తీసుకొచ్చి అన్నదాతలను రాజును చేశారు వైఎస్సార్. వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలకు కూడా ఎంతో చేయూతను అందించారు.

సీఎంగా ఉన్న సమయంలో వైఎస్సార్ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పేదలకు ఫ్రీగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ‘ఆరోగ్య శ్రీ’ స్కీమ్​ను తీసుకొచ్చారు. స్టూడెంట్స్ కోసం ‘ఫీజు రీయింబర్స్​మెంట్’ లాంటి అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాంటి వైఎస్​ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతిని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట వద్ద ఆయన కుటుంబీకులు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైఎస్ షర్మిలతో పాటు ఆమె కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

ఇవాళ తెలంగాణలోని పాలేరులో నిర్వహించే వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో షర్మిల పాల్గొననున్నారు. కాగా, తండ్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయకు చేరుకునే క్రమంలో షర్మిల ఎయిర్​పోర్ట్​లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో షర్మిలతో పాటు ఆమె కుమారుడు రాజారెడ్డి కూడా ఉన్నారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్.. రాజారెడ్డి హీరోలా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. మహేష్​బాబు లాంటి టాలీవుడ్ హీరోను తలదన్నేలా ఆయన లుక్స్ ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. హైట్, ఫిజిక్, అందం.. ఏ విధంగా చూసుకున్నా రాజారెడ్డిది హీరో కటౌట్ అని అంటున్నారు. కాగా, వైఎస్ రాజారెడ్డి ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నారు.

Jojobet GirişmeritbetmeritbetcasibomCasibomcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/