iDreamPost
android-app
ios-app

షర్మిల కోడలు ప్రియా అట్లూరి బ్యాగ్రౌండ్! ఇన్ని రోజులకి అసలు నిజం!

  • Published Dec 13, 2023 | 2:16 PM Updated Updated Dec 13, 2023 | 4:31 PM

YS Sharmila Son Raja Reddy & Atluri Priya Background: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అతడు వివాహం చేసుకోబోయే యువతి వివరాలంటూ కొంత సమాచారం వైరల్ అవుతోంది.

YS Sharmila Son Raja Reddy & Atluri Priya Background: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అతడు వివాహం చేసుకోబోయే యువతి వివరాలంటూ కొంత సమాచారం వైరల్ అవుతోంది.

  • Published Dec 13, 2023 | 2:16 PMUpdated Dec 13, 2023 | 4:31 PM
షర్మిల కోడలు ప్రియా అట్లూరి బ్యాగ్రౌండ్! ఇన్ని రోజులకి అసలు నిజం!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమారుడు వైఎస్ రాజా రెడ్డి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ప్రియా అట్లూరి అనే యువతిని ఆయన ప్రేమ వివాహం చేసుకోబోతున్నారంటూ మీడియా, సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం రాజా రెడ్డి, ప్రియా అట్లూరి కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. దాంతో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇలా ఉండగానే.. ఇక తాజాగా వైఎస్ విజయమ్మ.. ప్రియాను కలిసిన ఫోటో బయటకు రావడంతో.. పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ప్రియాకి విజయమ్మ చీర పెట్టి, బంగారు గాజులు బహుకరించారని తెలుస్తోంది.

విజయమ్మ కూడా ప్రియాను కలవడంతో.. వీరి పెళ్లి కన్ఫామ్ అయినట్లే అంటున్నారు. ఈ క్రమంలో షర్మిలకు కాబోయే కోడలు ప్రియా గురించి ఆరా తీస్తున్నారు. అయితే గతంలోనే ప్రియా-రాజా రెడ్డి కలిసి ఉన్న ఫొటో బయటకు వచ్చినప్పుడు.. ఆమె చట్నీస్ హెటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలుగా ప్రచారం సాగుతోంది. కానీ కొందరు మాత్రం.. ప్రియా అట్లూరి.. బ్రదర్ అనిల్ స్నేహితుడు శ్రీనివాస్ అట్లూరి కుమార్తె అంటున్నారు. బ్రదర్ అనిల్‌కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు అట్లూరి శ్రీనివాస్ చూస్తున్నారు. అమెరికాలో అట్లూరి శ్రీనివాస్‌కు కన్సల్టెన్సీ సంస్థ కూడా ఉందని వార్తలు వస్తున్నాయి.

అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమార్తెనే ఈ ప్రియా అని కొందరు అంటున్నారు. పైగా జీడిమెట్ల బస్ డిపో దగ్గర ఉన్న శ్రీ ప్రియ మెస్ యజమానులు ప్రియ మేనమామలు అని కొన్ని మీడియా సంస్థలు రాసుకొచ్చాయి. ప్రియా కుటుంబం ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారని.. ఆమెకు ఆ దేశ పౌరసత్వం కూడా ఉందని అంటున్నారు. అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ, ఎప్పుడో క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారని సమాచారం. ఇన్నాళ్లు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్‌తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుందని ప్రచారం సాగుతోంది. షర్మిల కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే.. ప్రియా గురించి అధికారికంగా పూర్తి వివరాలు తెలుస్తాయి.

ప్రియా-రాజా రెడ్డిల లవ్ స్టోరీ ఇది..

రాజా రెడ్డి, ప్రియా నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారట. షర్మిల కుమారుడు.. డ‌ల్లాస్ యూనివ‌ర్సిటిలో బ్యాచిల‌ర్ ఆండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ కోర్సును చదవడం కోసం అమెరికా వెళ్లాడు. ఆ సమయంలోనే అతడికి ప్రియాతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కాలేజ్ మేట్స్ కాదు.. చర్చి మేట్స్ . అనగా చర్చికి వచ్చిన సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారిందని సమాచారం. కాగా వైఎస్ రాజా రెడ్డి.. యూనివ‌ర్సిటీ నుంచి ఇదివరకే ప‌ట్టా అందుకున్నాడు. రాజా రెడ్డి యూనివర్శిటీ నుంచి పట్టా అందుకునే సమయంలో అనగా కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వైఎస్ షర్మిల దంపతులు, విజయమ్మ అమెరికా వెళ్లిన సంగతి తెలసిందే.

ప్రియా అట్లూరితో రాజా రెడ్డి వివాహానికి వైఎస్ షర్మిలతో పాటు ఇటు అనిల్ కుమార్ కూడా ఓకే చెప్పారు. అలాగే ప్రియ కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారు. దీంతో వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. వచ్చే సంవత్సరం మే నెలలో మ్యారేజ్ జరిగే అవకాశం ఉందని సమాచారం. వీరిది కులాంతర వివాహం. షర్మిల-బ్రదర్ అనిల్ లది ప్రేమ వివాహం మాత్రమే కాక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా. బ్రదర్ అనిల్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా.. షర్మిల రెడ్డి సామాజిక వర్గానికి చెందినామె. ఇప్పుడు తల్లిదండ్రులు బాటలోనే రాజా రెడ్డి కూడా కులాంతర ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş