Dharani
ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పంది. నేడు సీఎం జగన్ అర్హులైన వారి ఒక్కొక్కరి ఖాతాలో రూ.లక్ష-1.50 లక్షల వరకు నగదు మొత్తాన్ని జమ చేయనున్నారు. ఆ వివరాలు..
ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పంది. నేడు సీఎం జగన్ అర్హులైన వారి ఒక్కొక్కరి ఖాతాలో రూ.లక్ష-1.50 లక్షల వరకు నగదు మొత్తాన్ని జమ చేయనున్నారు. ఆ వివరాలు..
Dharani
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నారు. బడుగు బలహీన వర్గాలు వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందడం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. వాటి ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తూ.. అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. లబ్ధిదారులు ఒక్కొక్కరి ఖాతాల్లో లక్ష నుంచి 1.50 లక్షల రూపాయల వరకు జమ చేసేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..
బాల్య వివాహాలను అరికట్టి.. ఆడపిల్లల చదువలకు మరింత ఊతమిచ్చేందుకు వైఎస్ జగన్.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నేడు ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. 2023 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో వివాహాలు చేసుకున్న 10,132 అర్హులైన జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా” క్రింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఈ నేథప్యంలో సీఎం జగన్.. మంగళవారం నాడు క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో అందుకు సంబంధించిన మొత్తాన్ని జమ చేయనున్నారు.
పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడం మాత్రమే కాకుండా.. వారి వివాహం సమయంలో ఆర్థికంగా ఆదుకోవడం కోసం వైస్సార్ కళ్యాణమస్తు పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు ఆర్ధిక సాయం అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అలానే మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు “వైఎస్సార్ షాదీ తోఫా” ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి.. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే అర్హులైన వారికి నగదు చెల్లిస్తున్నారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి క్రింద ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 56,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 427.27 కోట్లు జమ చేశారు సీఎం జగన్.
అయితే ఈ పథకం కింద గత ప్రభుత్వంలో ఇస్తోన్న నిధులను భారీగా పెంచారు సీఎం జగన్.
మైనార్టీలు, దూదేకులు, నూర్ బాషా గత ప్రభుత్వంలో రూ.50,000గా సాయం ఉంటే దానిని లక్షకు పెంచారు. విభిన్న ప్రతిభావంతులకు రూ. 1,50,000 అందిస్తున్నారు. అలానే భవన, ఇతర నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ. 40,000 చెల్లిస్తున్నారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఆరు విడతల్లో 56,194 లబ్దిదారులకు మొత్తం రూ. రూ.427.27 కోట్లు చెల్లించారు. కళ్యాణమస్తు, షాదీ తోఫాలలో వధువుకు 18 ఏళ్ళు, వరునికి 21 ఏళ్ళ వయో పరిమితి ఉండటంతో బాల్య వివాహాలు చాలా వరకు తగ్గాయని అనేక నివేదికలు వెల్లడించాయి.