iDreamPost
android-app
ios-app

AP: శ్రీకాకుళం యువకుడి ప్రతిభ.. ఒకేసారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు

  • Published Feb 23, 2024 | 12:14 PM Updated Updated Feb 23, 2024 | 12:30 PM

పట్టుదలతో అనుకున్న లక్ష్యాలను చేదక్కించుకోవచ్చని ఇప్పటివరకు ఎంతో మంది నిరూపించారు. ఈ క్రమంలో శ్రీకాకుళంకు చెందిన యువకుడు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఓ ప్రైవేట్ ఉద్యోగాన్ని కూడా సాధించాడు.

పట్టుదలతో అనుకున్న లక్ష్యాలను చేదక్కించుకోవచ్చని ఇప్పటివరకు ఎంతో మంది నిరూపించారు. ఈ క్రమంలో శ్రీకాకుళంకు చెందిన యువకుడు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఓ ప్రైవేట్ ఉద్యోగాన్ని కూడా సాధించాడు.

  • Published Feb 23, 2024 | 12:14 PMUpdated Feb 23, 2024 | 12:30 PM
AP: శ్రీకాకుళం యువకుడి ప్రతిభ.. ఒకేసారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు

జీవితంలో ఎదో సాధించాలనే తపనతో ఎంతో మంది తమ లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని ఎంతో మంది రాత్రి పగలు కష్టపడుతూనే ఉంటారు. కానీ, కొందరు ఎంత కష్టపడినా కూడా .. కొన్ని కారణాల వలన ఒక్కోసారి విఫలం అవుతూ ఉంటారు. అలా విఫలం అయినా సరే కొంతమంది పట్టు వదలకుండా తమ లక్ష్యాన్ని ఛేదించే దిశగానే పయనిస్తూ .. చివరికి వారు అనుకున్నది అందిపుచ్చుకుంటారు. ఇప్పటివరకు ఇటువంటి సక్సెస్ స్టోరీస్ ఎన్నో చూసి ఉంటాం. ఇక మరి కొంతమందికి అదృష్టం ఒకేసారి నాలు ఐదు ప్రభుత్వ ఉద్యోగాల రూపంలో వరిస్తుంది. అలా అని దాని వెనుక వారి కష్టం లేకుండా పోదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రియల్ లైఫ్ స్టోరీలోని వ్యక్తి కథ కూడా ఇలాంటిదే. ఈ వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుందని చెప్పడానికి ఈ వ్యక్తి జీవితమే ఉదాహరణగా నిలుస్తుంది. శ్రీకాకుళం కు చెందిన ఈ యువకుడిని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక ప్రైవేట్ ఉద్యోగం వరించాయి. అది కూడా అతను కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగాలే అతనికి దక్కాయి. ఈ వ్యక్తి శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తొలాపికి చెందిన.. పప్పల హరి అప్పారావు, విజయలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు రమేష్‌.రమేష్ తండ్రి హరి అప్పారావు పూసపాటిరేగ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఈ వ్యక్తి విజయనగరంలోని జేఎన్‌టీయూలో .. కంప్యూటర్ సైన్స్ లో బీటెక్‌ పూర్తి చేశాడు. అయితే , బీటెక్ చదువుతున్న సమయంలోనే రమేష్ కు .. క్యాంపస్ ఇంటర్వ్యూలో టీసీఎస్‌ లో ఆఫర్ వచ్చింది. కానీ, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే దృఢ నిశ్చయంతో .. రమేష్ టీసీఎస్‌ లో ఆఫర్ ను వదులుకున్నాడు.

ఇక ఆ తర్వాత తానూ అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేసి.. ప్రభుత్వ పరీక్షల కోసం ఎంతో కష్టపడి చదివాడు. అతని కష్టానికి ప్రతి ఫలంగా .. మొదటి ప్రయత్నంలోనే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ కో – ఆపరేటివ్‌ బ్యాంకు మేనేజరుగా, ఎస్‌బీఐ కర్ల్క్‌గా, ఏపీజీవీబీలో ఆడిట్ అధికారిగా ఎంపికయ్యాడు రమేష్. కానీ, వీటిలో ఏ ఒక్క ఆఫర్ ను అందిపుచ్చుకోలేదు. ఇంకా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న క్రమంలో నాబార్డ్‌ నిర్వహించిన పరీక్షలకు సిద్దమయ్యి.. తన ప్రతిభను ఇక్కడ కూడా కనబరిచాడు. ఈ క్రమంలో బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో గ్రేడ్‌-ఏ మేనేజరుగా అర్హత సాధించాడు రమేష్. ఇలా ఏడాది వ్యవధిలో ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి అందరి ప్రశంసలు పొందాడు రమేష్. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.