Arjun Suravaram
Jagananna Gorumudda: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారం అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై ఎల్లో మీడియాలో అసత్యపు రాతలు రాస్తున్నాయి. అసలు వాస్తవాలు..
Jagananna Gorumudda: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారం అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై ఎల్లో మీడియాలో అసత్యపు రాతలు రాస్తున్నాయి. అసలు వాస్తవాలు..
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా, వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా విద్యారంగంలో సీఎం జగన్ తనదైన మార్క్ ను చూపించారు. అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక.. ఇలా చెప్పుకుంటూ పోతే..పేద విద్యార్థుల కోసం ఎన్నో స్కీమ్స్ ను ప్రారంభించారు. నాణ్యమైన చదువు, ఆరోగ్యం విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పని చేస్తుంది. అయితే ఇంతలా పేద విద్యార్థులకు అందిస్తున్న పథకాల విషయంలో విపక్ష పార్టీలు, కొన్ని మీడియా పత్రికలు, ఛానళ్ళు అసత్యపు రాతలతో విషం చిమ్ముతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారం అందించడమే లక్ష్యంగా ‘జగనన్న గోరుముద్ద’ అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఆ విధంగానే మధ్యాహ్న భోజనంలో పెను మార్పులు తీసుకొచ్చి..పౌష్టికాహారాన్ని అందిస్తుంది. విద్యార్థులకు మంచి ఆరోగ్యంతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక మెనూ రూపొందించి.. రోజుకో రకమైన ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ పథకాన్ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేద కుటుంబాలకు పిల్లల చదువు భారంగా కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తుంది.
పిల్లలకు అందించే గోరుముద్ద విషయంలో సీఎం జగన్ ఎక్కడా రాజీపడలేదు. తరచూ జగనన్న గోరుముద్ద కార్యక్రమంపై సమీక్షలు నిర్వహించి.. ఇంకా మెరుగైన పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జగనన్న గోరుముద్ద కార్యక్రమం చాలా అద్భుతంగా సాగుతోంది. అంతేకాక శుచి, శుభ్రమైన పౌష్టికాహారంతో దేశానికే ఆదర్శంగా ఈ కార్యక్రమం నిలిచింది. సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులు, టీచర్ల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని గోరుముద్ద ప్రోగ్రామ్ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. 16 రకాల మెనూతో వారానికి 5 రోజులు గుడ్డును ఈ జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా అందిస్తున్నారు.
ఇలా పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమంలో విపక్ష టీడీపీ అసత్య వార్తలను ప్రచారం చేస్తుంది. అంతేకాక తన అనుకూల మీడియాల ద్వారా ఆ అసత్య వార్తలను మరింత ఎక్కువగా చూపిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని మీడియా పత్రికలు, ఛానల్స్ గోరుముద్ద పథకంపై విషం చిమ్ముతున్నాయి. నిజంగా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే చెప్పాల్సింది పోయి.. కల్తీ రాతలు రాసి శునకానందం పొందుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అంతేకాక గోరుముద్దపై పిచ్చి రాతలు రాసే సదరు మీడియాలు కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలని అంటున్నారు.
ఐదేళ్లలో మొత్తం 6,995 కోట్ల బడ్జెట్ ను జగన ప్రభుత్వం కేటాయించింది. ఈ గోరుముద్ద కార్యక్రమం కోసం ఏటా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.1400 కోట్లు ఖర్చు చేస్తుంది. అదే టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజనం కోసం ఏటా చేసిన ఖర్చు కేవలం రూ.450 కోట్లు మాత్రమే. 2023-24 బడ్జెట్ లోనూ రూ.1,689 కోట్లు గోరుముద్ద కోసం జగన్ సర్కార్ కేటాయించింది. దీని బట్టే పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించే విషయంలో ఎవరికి చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
అలానే కూరగాయలు ధరలు పెరిగిన క్రమంలోనూ జగన్ ప్రభుత్వం మరింత శ్రద్ధగా ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా విద్యార్థుల ఆహారం విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 32 లక్షల మందికే మధ్యాహ్న భోజన పథకం అందజేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు 43,46,299 మందికి జగనన్న గోరుముద్దను అందజేస్తుంది. అంటే గతం కన్నా 30 నుంచి 40 శాతం విద్యార్థులు పెరిగారు. ఇలా దేశానికే ఆదర్మమైనటువంటి ఒక మంచి కార్యక్రమంపై విపక్ష పార్టీ అనుకూల మీడియా పైత్యం చూపించే రాతలు రాయడం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.