iDreamPost

ఒపీనియన్ పోల్స్‌కి, ఎగ్జిట్ పోల్స్‌కి తేడా ఏంటి? వీటిలో ఏది ఖచ్చితంగా ఉంటుందంటే?

Opinion Polls vs Exit Polls: ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఒపీనియన్ పోల్స్ అని, ఎగ్జిట్ పోల్స్ అని హడావుడి మొదలవుతుంది. అయితే ఈ పోల్స్ మధ్య తేడా ఏంటి? ఏ పోల్స్ ఖచ్చితంగా ఉంటాయి? అనే వివరాలు మీ కోసం.

Opinion Polls vs Exit Polls: ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఒపీనియన్ పోల్స్ అని, ఎగ్జిట్ పోల్స్ అని హడావుడి మొదలవుతుంది. అయితే ఈ పోల్స్ మధ్య తేడా ఏంటి? ఏ పోల్స్ ఖచ్చితంగా ఉంటాయి? అనే వివరాలు మీ కోసం.

ఒపీనియన్ పోల్స్‌కి, ఎగ్జిట్ పోల్స్‌కి తేడా ఏంటి? వీటిలో ఏది ఖచ్చితంగా ఉంటుందంటే?

దేశవ్యాప్తంగా ఒకవైపు లోక్ సభ ఎన్నికల గురించి చర్చ నడుస్తుండగా.. మరోవైపు పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చ నడుస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. ఇక ఏపీ ఎన్నికల విషయంలో అయితే ఈ హీట్ మరింత తీవ్రంగా ఉంది. వైసీపీ, కూటమి.. ఈ రెండిటిలో ఏ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందనే ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ అనేవి 6.30 గంటలకు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బేస్ చేసుకుని ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనేది ఒక అంచనా వేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితమేనా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. అసలు ఒపీనియన్ పోల్స్ కి, ఎగ్జిట్ పోల్స్ కి తేడా ఏంటి? ఈ రెండిటిలో ఏది ఖచ్చితంగా ఉంటుంది అన్న సందేహం అయితే ఉంటుంది.   

ఒపీనియన్ పోల్స్ అంటే:

ఎన్నికల వాతావరణం మొదలైందంటే చాలు ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ హడావుడి మొదలవుతుంది. ఓటర్ పల్స్ తెలుసుకునేందుకు మీడియా సంస్థలు, ఇతర సంస్థలు అనేక సర్వేలు చేపడతాయి. ఒపీనియన్ పోల్స్ అంటే పోలింగ్ కు ముందు నిర్వహించేవి. కేంద్ర ఎన్నికల సంఘం విధించిన షరతులకు లోబడి పలు సంస్థలు ఒపీనియన్ పోల్స్ ని వెల్లడిస్తాయి. ఎన్నికలు మొదలయ్యే ముందు పలు దశల్లో ఈ ఒపీనియన్ పోల్స్ ని విడుదల చేస్తాయి. పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయకముందు, షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇలా వివిధ దశల్లో ఒపీనియన్ పోల్స్ ని విడుదల చేస్తారు. ప్రజల నాడి తెలుసుకునేందుకు పలు సర్వేలు చేపడతారు. రైతులు, యువతీయువకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు ఇలా అన్ని వర్గాల వారి దగ్గర అభిప్రాయాలను సేకరిస్తారు. కులం, మతం ఆధారంగా కూడా సర్వేలు నిర్వహిస్తారు. పలు రాజకీయ పార్టీలు కూడా ఒపీనియన్ పోల్స్ ని నిర్వహిస్తూ ఉంటాయి.     

ఎగ్జిట్ పోల్స్:

అన్ని దశల పోలింగ్ పూర్తైన తర్వాత వెలువరించే పోల్స్ ని ఎగ్జిట్ పోల్స్ అని అంటారు. ఎగ్జిట్ పోల్స్ లో భాగంగా.. ఎన్నికలు జరిగిన రోజున పోలింగ్ బూత్ లో ఓటర్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. ఓటర్ల సమాధానాలను బట్టి ఏ పార్టీకి ఎక్కువ మంది ఓటు వేశారు అనే వివరాలను నమోదు చేసి.. పార్టీలకు ఎంత ఓటింగ్ శాతం వస్తుంది? ఆ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? ఏ అభ్యర్థి గెలుస్తారు? అని అంచనా వేసి చివరి విడత ఎన్నికలు ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ ని విడుదల చేస్తారు. 

ఏది ఖచ్చితంగా ఉంటుందంటే?:

ఒపీనియన్ పోల్స్ తో పోలిస్తే.. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎన్నికల తుది ఫలితాలకు దగ్గరగా ఉంటుంది. దీనికి కారణం ఒపీనియన్ పోల్స్ అనేవి ఎన్నికల ముందు నిర్వహించేది. కానీ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎన్నికలు పూర్తైన వెంటనే తీసుకుంటారు. కాబట్టి ఆ సమయంలో ఆ ఓటర్ మూడ్ ని బట్టి ఏ పార్టీకి ఓటు వేశారో అన్న సమాచారం ఉంటుంది. పైగా ఒపీనియన్ పోల్స్ అప్పుడు ఓటర్ చెప్పిన పార్టీకి కాకుండా మనసు మార్చుకుని పోలింగ్ సమయంలో వేరే పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంటుంది. దీని కారణంగానే ఒపీనియన్ పోల్స్ తో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా ఉంటాయన్న అభిప్రాయాలు ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి