iDreamPost
android-app
ios-app

దుమ్ములేపుతున్న ‘వ్యూహం’ సినిమాలోని YSRCP పాట

  • Published Oct 16, 2023 | 4:51 PM Updated Updated Oct 16, 2023 | 4:51 PM
  • Published Oct 16, 2023 | 4:51 PMUpdated Oct 16, 2023 | 4:51 PM
దుమ్ములేపుతున్న ‘వ్యూహం’ సినిమాలోని YSRCP పాట

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ‘వ్యూహం’ అనే పొలిటికల్‌ డ్రామా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయాలే ప్రధాన అంశంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా, ఈ సినిమాలోని ఓ పాట విడుదలై సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. వైఎస్సార్‌ సీపీకి సంబంధించిన ఆ పాట జనాలకు తెగ నచ్చేసింది.

‘‘ వైఎస్సార్‌ సీపీ.. వైఎస్సార్‌ సీపీ.. వైఎస్సార్‌ సీపీ..
ఢీకొట్టే మా పార్టీ వచ్చింది చూడు..
దమ్మున్న మా పార్టీ వచ్చింది చూడు..
ఆంధ్రప్రాంతంలో పుట్టింది నేడు..
సీమ సింహంలా తొడగొట్టే చూడు..
ఊరు ఊరంతా ఉండాలి తోడు..
దూసుకొచ్చేలా రాజన్న రాజ్యమే..

అంటూ సాగుతున్న పాట వింటున్న వారిని మైమరిపింప చేస్తోంది. నెటిజన్లు పాట సూపర్‌ ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాత్రలో అజ్మల్‌ అమీర్‌ నటించారు. వైఎస్‌ భారతి పాత్రలో మానస రామకృష్ణన్‌ నటించారు. దాసరి కిరణ్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం.. 2023 నవంబర్‌ 10న, రెండో భాగం.. 2024 జనవరి 25న థియేటర్లలోకి రానున్నాయి. మరి,  దుమ్ములేపుతున్న ‘వ్యూహం’ సినిమాలోని YSRCP పాటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş