P Krishna
Pension Disbursed Volunteer: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పింఛన్ల పంపిణీ విషయంలో ఒక నూతన ఒరవడి తీసుకువచ్చింది. లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా పింఛన్లు ఇంటికి వెళ్లి ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టింది.
Pension Disbursed Volunteer: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పింఛన్ల పంపిణీ విషయంలో ఒక నూతన ఒరవడి తీసుకువచ్చింది. లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా పింఛన్లు ఇంటికి వెళ్లి ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టింది.
P Krishna
ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో నూతన ఒరవడి తీసుకువచ్చింది. లబ్దిదారులకు నేరుగా పింఛన్లు అందించే ప్రక్రియ దిగ్విజయంగా మొదలు పెట్టింది. గ్రామ వాలంటీర్స్ సిస్టమ్ ఏపీ ప్రభుత్వపు అతి ముఖ్య కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాల ప్రయోజనాలకు అర్హత కలిగిన లబ్దిదారులందరికీ ఇంటి వద్దకే చేరవేయడం వీరి పని. వాలంటీర్ల వ్యవస్థ వల్ల గ్రామాల్లో ప్రజలందరికీ సులభంగా ప్రభుత్వ సర్వీసులు అందుతున్నాయి. తద్వారా గ్రామీణాభివృద్ది జరుగుతుంది.
ఒకప్పుడు మహాత్మాగాంధీ అన్నట్లు పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అనే మాట సీఎం జగన్ అక్షరాలా నిజం చేస్తున్నారనే చెప్పొచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలుస్తుంది. లబ్దిదారులకు ఇంటికే నేరుగా వెళ్లి పింఛన్లు అందించే ప్రక్రియ వల్ల ఎంతోమంది వృద్దులకు మేలు కలుగుతుంది. పించన్ దారులు వేరే ప్రాంతంలో ఉన్న వాలంటీర్లు అక్కడికి ఎన్ని వ్యవప్రయాసలకు ఓర్చైనా సరే వెళ్లి పించన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. లబ్దిదారులు వేరే ఊర్లో ఉంటే.. తమ సొంత ఖర్చు పెట్టుకొని మరీ అక్కడికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్ అందజేస్తున్నారు.
ఏపీలో ఓ వాలంటీర్ చేసిన పనికి అందరూ శభాష్ అంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాటిగరువుకు చెందిన గ్రామ వాలంటీర్ కిరసాయిని రోజా రాణి తోటి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచింది. శుక్రవారం ఆమె పెళ్లి.. బంధు మిత్రులు అందరూ వచ్చారు. అయితే ఈ రోజు ఒకటవ తేదీ కావడంతో పింఛన్ దారులు తమ పింఛన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే రోజా రాణి కీలక నిర్ణయం తీసుకుంది. తన పెళ్లి కన్నా ముందు పింఛన్ దారుల కళ్లలో ఆనందం చూడాలి. అందుకోసం తన ఉద్యోగానికే ప్రాధాన్యత ఇచ్చింది. పెళ్లి దుస్తుల్లోనే లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేసింది. ఉద్యోగం పట్ల ఆమెకు ఉన్న నిబద్దతకు ప్రశంసలు కురిపిస్తున్నారు.