iDreamPost
android-app
ios-app

విజయనగరం రైలు ప్రమాదం.. ఈ రైళ్లు రద్దు

  • Published Oct 30, 2023 | 9:23 AM Updated Updated Oct 30, 2023 | 9:23 AM

ఆంధ్రప్రదేశ్‌, విజయనగరంలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం కారణంగా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. కొన్ని సర్వీస్‌లను రీషెడ్యూల్‌ చేసింది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌, విజయనగరంలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం కారణంగా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. కొన్ని సర్వీస్‌లను రీషెడ్యూల్‌ చేసింది. ఆ వివరాలు..

  • Published Oct 30, 2023 | 9:23 AMUpdated Oct 30, 2023 | 9:23 AM
విజయనగరం రైలు ప్రమాదం.. ఈ రైళ్లు రద్దు

విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులకు విశాఖ కేజీహెచ్‌లో, విమ్స్‌లో చికిత్స నిమిత్తం వైద్యబృందాలను అందుబాటులో ఉంచారు. విశాఖ నుంచి సంఘటనా స్థలానికి అంబులెన్స్‌ని పంపుతున్నారు. ఇక రైలు ప్రమాద బాధితుల సమాచారం, సహాయం కోసం రైల్వే అధికారులు హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు.

ఇక ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రద్దయిన రైళ్లలో రత్నాచల్‌, సింహాద్రి, ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-పూరీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కూడా ఉన్నాయి. రద్దయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

రద్దయిన రైళ్లు ఇవే..

  1. 12718- విజయవాడ-విశాఖపట్నం రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌
  2. 12717- విశాఖపట్నం-విజయవాడ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌
  3. 17239- గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌
  4. 17267- కాకినాడ-విశాఖపట్నం మెమూ ఎక్స్‌ప్రెస్‌
  5. 17268- విశాఖపట్నం-కాకినాడ మెమూ ఎక్స్‌ప్రెస్‌
  6. 07466- రాజమండ్రి-విశాఖపట్నం మెమూ స్పెషల్‌
  7. 07466- విశాఖపట్నం-రాజమండ్రి మెమూ స్పెషల్‌
  8. 17243- గుంటూరు- రాయగడ ఎక్స్‌ప్రెస్‌
  9. 08545- కోరాపుట్‌-విశాఖపట్నం స్పెషల్‌
  10. 08546- విశాఖపట్నం- కోరాపుట్‌ స్పెషల్‌
  11. 22860- ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- పూరీ ఎక్స్‌ప్రెస్‌
  12. 17244- రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌
  13. 17240 విశాఖపట్నం- గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (నేడు, రేపు రద్దు)

దారి మళ్లించిన రైళ్ల వివరాలు..

  1. ధన్‌బాద్‌ నుంచి 29న బయల్దేరాల్సిన ధన్‌బాద్‌ – అలెప్పీ బొకారో ఎక్స్‌ప్రెస్‌ను(13351 ) ఝార్సుగూడ, రాయ్‌పుర్‌, నాగ్‌పుర్‌, కాజీపేట, విజయవాడ మీదుగా దారి మళ్లించారు.
  2. హతియా నుంచి 29న బయల్దేరాల్సిన హతియా – ఎస్‌ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ను(12835 ) ఝార్సుగూడ, రాయ్‌పుర్‌, నాగ్‌పుర్‌, కాజీపేట, విజయవాడ మీదుగా దారి మళ్లించారు.

విజయవాడ – నాగ్‌పుర్‌ – రాయ్‌పుర్‌ – ఝార్సుగూడ – ఖరగ్‌పూర్‌ మీదుగా..

  1. 28.10.2023 – ట్రైన్‌ నం.22852 – మంగళూరు సెంట్రల్‌ -సంత్రగచ్చి ఎక్స్‌ప్రెస్‌
  2. 29.10.2023 – ట్రైన్‌ నం.12246 – ఎస్‌ఎంవీ బెంగళూరు -హవ్‌డా దురంతో ఎక్స్‌ప్రెస్‌
  3. 29.10.2023 – ట్రైన్‌ నం.20890 – తిరుపతి – హవ్‌డా ఎక్స్‌ప్రెస్‌
  4. 29.10.2023 – ట్రైన్‌ నం.12704 – సికింద్రాబాద్‌ – హవ్‌డా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌
  5. 29.10.2023 – ట్రైన్‌ నం.12864 – ఎస్‌ఎంవీ బెంగళూరు – హవ్‌డా ఎక్స్‌ప్రెస్‌
  6. 29.10.2023 – ట్రైన్‌ నం.22305 – ఎస్‌ఎంవీ బెంగళూరు -జసిది ఎక్స్‌ప్రెస్‌
  7. 28.10.2023 – ట్రైన్‌ నం.22503 – కన్యాకుమారి -ఎస్‌ఎంవీ బెంగళూరు
  8. 29.10.2023 – ట్రైన్‌ నం.12840 – ఎంజీఆర్‌ చెన్నై -హవ్‌డా మెయిల్‌
  9. 29.10.2023 – ట్రైన్‌ నం.18048 – వాస్కోడిగామా – షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌

రైళ్ల వేళల్లో మార్పులు..

  • హవ్‌డా నుంచి 29న 22.55 గంటలకు బయల్దేరాల్సిన హవ్‌డా – శ్రీ ఎమ్‌. విశ్వేశ్వరయ్యా టెర్మినల్‌(బెంగళూరు) ఎక్స్‌ప్రెస్‌ను(12863) 30వ తేదీ 00.55 గంటలకు మార్చారు.
  • హవ్‌డా నుంచి 29న 23.25 గంటలకు బయల్దేరాల్సిన హవ్‌డా – పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌ను(12867) 30వ తేదీ 01.25 గంటలకు మార్చారు.
  • హవ్‌డా నుంచి 29న 23.55 గంటలకు బయల్దేరాల్సిన హవ్‌డా – ఎంజీఆర్‌ చెన్నై మెయిల్‌ను(12839) 30వ తేదీ 01.55 గంటలకు రీషెడ్యూల్‌ చేశారు.
  • షాలిమార్‌ నుంచి 29న 01.50 గంటలకు బయల్దేరాల్సిన షాలిమార్‌ – తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్‌ను(22642) 30వ తేదీ 01.50 గంటలకు మార్చారు.
  • ఎంజీఆర్‌ చెన్నై నుంచి 30న 07.00 గంటలకు బయల్దేరాల్సిన ఎంజీఆర్‌ చెన్నై – షాలిమార్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ను(12842) 30వ తేదీ 09.30 గంటలకు రీషెడ్యూల్‌ చేశారు.
  • అలప్పుజా నుంచి 30న 06.00 గంటలకు బయల్దేరాల్సిన అలప్పుజా – ధన్‌బాద్‌ బోకారో ఎక్స్‌ప్రెస్‌ను(13352) 30వ తేదీ 09.00 గంటలకు మార్చారు.

Jojobet GirişmeritbetmeritbetcasibomCasibom girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Giriş