iDreamPost
android-app
ios-app

చంద్రబాబు అరెస్ట్ పై ముందే జోస్యం చెప్పిన వేణు స్వామి!

  • Published Sep 11, 2023 | 3:40 PM Updated Updated Sep 11, 2023 | 3:40 PM
  • Published Sep 11, 2023 | 3:40 PMUpdated Sep 11, 2023 | 3:40 PM
చంద్రబాబు అరెస్ట్ పై ముందే జోస్యం చెప్పిన వేణు స్వామి!

సీమెన్స్‌ స్కాం కేసులో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే.  శనివారం ఉదయం ఆయన్ని ఏపీ సీఐడీ అధికారులు నంద్యాలలో అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో ప్రముఖ ఆస్ట్రాలజర్‌ వేణు స్వామి జోస్యానికి సంబంధించిన పాత వీడియో  వైరల్‌గా మారింది. చంద్రబాబు అరెస్ట్‌ అవుతారని ఆయన మూడేళ్ల క్రితం చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నాలుగేళ్ల క్రితం ఆయన ఐడ్రీమ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

 ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్‌ చంద్రబాబు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘‘ చంద్రబాబు కచ్చితంగా సమస్యల బారిన పడతారు. వందకు వందశాతం ఆయన సమస్యల బారిన పడతారు. లోకేష్‌కు 2024 వరకు బ్యాడ్‌ టైమ్‌ నడుస్తోంది. 2024లో లోకేష్‌ గెలవటం కష్టం. ఏ రెమిడీ తీసుకున్నా.. సబ్జెక్ట్‌ చెయ్యి దాటి పోయింది’’ అని అన్నారు. వేణు స్వామి అప్పుడు అన్న మాటలు ఇప్పుడు నిజం అయ్యాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయ్యారు. ప్రస్తుతం జైలులో ఉన్నారు.

ఆదివారం ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. జైలులో చంద్రబాబుకు ఖైదీ నెంబర్ 7691ను కేటాయించారు. ఎస్పీజీ భద్రత కలిగిన వ్యక్తి కావడంతో..మాములు ఖైదీలకు దూరంగా ఉంచారు.  ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంటి భోజనాన్ని ఆయనకు అందిస్తున్నారు. మరి, మూడేళ్ల క్రితం వేణు స్వామి చెప్పిన జోస్యం ఇప్పుడు నిజం కావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss