600కి 599 మార్కులు వచ్చాక.. తొలిసారి ఈ అమ్మాయి ఏమి మాట్లాడిందంటే? ఇంత సంస్కారమా?

AP SSC Results 2024: నిన్న టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ ఏడాది ఏపీలో పదవ తరగతి రిజల్ట్స్ కనీవినీ ఎరుగని రీతిలో 86.69 శాతం ఉత్తీర్ణ నమోదైంది.

AP SSC Results 2024: నిన్న టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ ఏడాది ఏపీలో పదవ తరగతి రిజల్ట్స్ కనీవినీ ఎరుగని రీతిలో 86.69 శాతం ఉత్తీర్ణ నమోదైంది.

నేటి కాంపిటీషన్ కాలంలో మంచి చదువు చదివి మంచి ఉద్యోగం చేస్తే విలువ గౌరవం ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. తమ పిల్లలను మంచి విద్యాసంస్థల్లో చేర్పించి మంచి చదువు చెప్పించేందుకు తల్లిదండ్రుల ఎంతో కష్టపడుతున్నారు. తమ పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణులైతే ఆ తల్లిదండ్రులు ఆనందానికి అవధులు ఉండవు. ఏపీలో పదో తరగతి ఫలితాలు సోమవారం రిలీజ్ అయ్యాయి. ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల నాగసాయి మనస్వి రాష్ట్రంలో టాప్ ర్యాంక్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అమ్మాయి తొలిసారిగా మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్కరూ శభాష్ అంటారు. వివరాల్లోకి వెళితే..

సోమవారం ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది 86.69 ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యింది. పార్వతీపురం మన్యం జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతం ఉంటే.. కర్నూల్ జిల్లా లాస్ట్ లో నిలిచాయి. ఇక ఏలూరు జిల్లాకు చెందిన ఆకులు వెంకట నాగసాయి మానస్వి రాష్ట్రంలోనే టాన్ ర్యాంక్ సాధించింది. నాగసాయికి టెన్త్ లో మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు వచ్చాయి. సెకండ్ లాగ్వేజ్ (హిందీ) లో ఒక్క మార్కు తక్కువ వచ్చింది. మిగతా అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. నాగసాయి మానస్వి తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగస్థులు. తండ్రి నాగ వరప్రసాద్ రావు, తల్లి నాగ శైలజ గవర్నమెంట్ స్కూల్ టీచర్లే. వారి ఏకైక సంతానం నాగసాయి మానస్వి. చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల క్రమశిక్షణ, చదువు అంటే ఎంతో అభిమానం ఇష్టం. నాగసాయి మానస్వి క్లాస్ పుస్తకాలే కాదు.. ఇతర సబ్జెక్ట్స్ పుస్తకాలు కూడా బాగా చదువుతుంది.

తొలిసారిగా ఆకులు వెంకట నాగసాయి మానస్వి మాట్లాడింది. ‘నాకు ఇన్ని మార్కులు రావడానికి కారణం.. మా అమ్మానాన్న. నన్ను ఎప్పుడై గైడ్ చేస్తూ వచ్చిన మా టీచర్లు. మా నాన్నే నా హీరో. చదువులో రాణిస్తే గొప్ప స్థాయిలో ఉంటారని చెబుతూ ఉంటారు. నా రోల్ మోడల్ ఏపీజే అబ్దుల్ కలామ్. నేను సినిమాలు చాలా తక్కువగా చూస్తాను. ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరంటే మా నాన్నే. ఆయనే నాకు బెస్ట్ ఫ్రెండ్. నాన్న ఎప్పుడూ ఖాళీగా ఉండరు.. నా గురించే ఆలోచిస్తారు. పాతికేళ్ల క్రితం డిఎస్సీ రాసినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు.. ట్యూషన్స్ చెబుతూ.. వ్యవసాయం చేస్తూ కష్టపడ్డారు. 2023 లో నాన్నకు ఉద్యోగం వచ్చింది.తనకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని బాధపడకుండా.. కష్టపడి నన్ను చదివించి ఈ స్థాయికి తీసుకువచ్చారు. నేను ఏది సాధించినా మా నాన్న నాకు ఎప్పుడు వెన్నంటే ఉంటారు’ అంటూ తన తల్లిదండ్రుల, ఉపాద్యాయుల గురించి ఎంతో గొప్పగా చెప్పింది. ప్రస్తుతం మనస్వి సాధించిన రికార్డుపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

 

Show comments