Arjun Suravaram
Chandrababu, Mylavaram: టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నమ్మిన వారిని మోసం చేస్తాడని చాలా మంది అంటుంటారు. ఆ మాటలు నిజం చేస్తూ కొన్ని ఘటనలు కూడా జరిగాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమాను కూడా చంద్రబాబు ముంచేశాడనే టాక్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది.
Chandrababu, Mylavaram: టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నమ్మిన వారిని మోసం చేస్తాడని చాలా మంది అంటుంటారు. ఆ మాటలు నిజం చేస్తూ కొన్ని ఘటనలు కూడా జరిగాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమాను కూడా చంద్రబాబు ముంచేశాడనే టాక్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది.
Arjun Suravaram
ఎవరైనా సరే.. తనను నమ్మి..వెంట నడిచిన వారిని ఎప్పుడూ వదిలేయకూడదు. అలానే తమ అవసరాల కోసం నట్టేటా ముంచకూడదు. అయితే రాజకీయాల్లో ఇందుకు భిన్నంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా తమ రాజకీయ భవిష్యత్ కోసం, అధికారం కోసం నమ్మిన వారిని నట్టేటా ముంచే నాయకులే ఎక్కువ ఉన్నారు. ఏళ్ల తరబడి తమ వెంట ఉన్నవారికి.. స్వార్థంతో వెన్నుపోటు పొడిచే వారు ఉన్నారు. ఇలాంటి వారి జాబితాలో ఎక్కువగా వినిపించే పేరు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన వెన్నుపోటు దారుడని, నమ్మిన వారిని నడి సంద్రంలో ముంచే వ్యక్తి అని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. ఆ మాటలనే నిజం చేస్తూ కొన్ని ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమాను కూడా ముంచేశాడనే టాక్ వినిపిస్తోంది.
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీ కీలక నేతల్లో ఆయన ఒకరు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే వారిలో ఆయన ఒకరు. ఇంకా చెప్పాలంటే.. చంద్రబాబు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనకు , పార్టీకి అండగా నిలబడిన వారిలో ముఖ్యులు దేవినేని ఉమా. అలాంటి వ్యక్తికే..మైలావరం సీటును పెండింగ్ లో పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నమ్మిన వారిని, ఎంతో కాలంగా పార్టీ కోసం పని చేసే వారికి హ్యాండ్ ఇవ్వడం చంద్రబాబు అలవాటేనని పలువురు టీడీపీ మాజీ నేతలు చెప్పుకొచ్చారు. నూజివీడు, తిరువూరు, పులివెందుల వంటి అనేక నియోజవర్గాల్లో చాలా మంది టీడీపీ నేతలకు చంద్రబాబు టికెట్ హ్యాండ్ ఇచ్చారు. తాజాగా దేవినేని ఉమాను కూడా అలానే ముంచేస్తున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. మైలవరం టికెట్ ను తనకే కేటాయించాలనే హామీతోనే టీడీపీలో చేరినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే సమయంలో వసంత కృష్ణ ప్రసాద్ చేరక ముందు నుంచి..ఈ ప్రతిపాదనను దేవినేని ఉమా వ్యతిరేకిస్తూ వచ్చారు. తాజాగా వసంత కృష్ణ ప్రసాద్ చేరికతో మైలవరం టీడీపీలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. శుక్రవారం చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. ఆయనతో వెంట కేశినేని చిన్ని, నెట్టెం రఘురాం ఉన్నారు.
ఇక టీడీపీలోకి వసంత రాకను దేవినేని ఉమా, అతని అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వసంత చేరిక సమయంలో దేవినేని ఉమా కనిపించలేదు. వసంత కృష్ణప్రసాద్‌ను పార్టీలో చేర్చుకోవద్దని గతంలోనే చంద్రబాబుకు ఉమా చెప్పినట్లు టాక్. అయితే ఉమామాటలను చంద్రబాబు పట్టించుకోకుండా వసంత ప్రసాద్ ను చేర్చుకున్నారు. ఇదే సమయంలో కృష్ణ ప్రసాద్ చేరికను వ్యతిరేకిస్తూ.. నిన్న అనుచరులతో కలిసి దేవినేని ఉమా తిరుగుబాటు చేశారు. శంఖరావం పేరుతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈక్రమంలో ఎవరో వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సహకరించేది లేదని దేవినేని ఉమా, అనుచరులు, టీడీపీ కార్యకర్తలు తెగేసి చెప్పారు. ఉమాను కాదని మరో వ్యక్తికి మైలవరం టిక్కెట్ కేటాయిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన అనుచరులు ఇప్పటికే టీడీపీకి హెచ్చరికలు చేశారు. వసంత రాకను ఉమాతో పాటు వసంత రాకను బొమ్మసాని సుబ్బారావు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా నమ్మిన వారిని మోసం చేయడం అలవాటుగా చేసుకున్న చంద్రబాబు.. ఉమాను కూడా ముంచేశాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.