iDreamPost
android-app
ios-app

వీడియో: ముసలమ్మ దేవతకు లక్షల నోట్లతో అలంకరణ

వీడియో: ముసలమ్మ దేవతకు లక్షల నోట్లతో అలంకరణ

నేడు వరలక్ష్మి వ్రతం కావడంతో.. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తున్నారు. ఇళ్లను శుభ్రం చేసుకుని.. ముగ్గులతో ముస్తాబు చేసుకున్నారు. అలానే వరలక్ష్మీ దేవి విగ్రహాన్ని ప్రత్యేకంగా ప్రతిష్టించి.. పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారుల ఆలయాలు కాంతి దీపాలతో, మామిడి తోరణాలతో, వివిధ రకాల పూలతో ఎంతో అందంగా ముస్తాబు చేశారు. కొన్ని ఆలయాల్లో అమ్మవారిని పళ్లు, పూలు, డబ్బుల నోట్లు వంటి వాటితో అందంగా అలంకరించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక శ్రీ పుంతలో ముసలమ్మ వారిని కూడా లక్షల విలువ చేసే నోట్లతో అలంకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో ఉన్న ముసలమ్మ దేవత చాలా  ప్రసిద్ధి చెందినది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. నేడు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వత్రం కావడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఆలయ సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అలానే ముసలమ్మ వారిని ఎంతో అందంగా అలకరించారు. అమ్మవారి ఆలయాన్ని రూ. 31 .25 లక్షల  నోట్లతో అలంకరించారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న అన్ని రకాల కొత్త నోట్లను అంటే 1,2,5,10,20,50,100,200,500 నోట్లను వినియోగించి అలంకరణ అద్భుతంగా చేశారు. అలాగే బ్యాంకుల ద్వారా కొత్త నాణేలు కూడా తీసుకుని అలంకరించారు. మూడు రోజుల పాటు ముప్పై మంది శ్రమించి అమ్మవారికి ఇంత అద్భుతంగా అలంకరణ చేశారు.

సంక్రాంతి, విజయదశమి, దీపావళి తదితర వేడుకలను ఈ ఆలయ కమిటీ వారు విన్నూత్న రీతిలో జరుపుతూ ప్రత్యేకతను చాటుకుంటూ వార్తలకు ఎక్కుతారు. ఆ విధంగానే ఈ అమ్మవారిని ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరణకు లక్షలాది రూపాయల నోట్లను వినియోగించడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ధనలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి నిత్య అలంకరణ చేసే రమేష్ కుమార్ శర్మ, ధవళేశ్వరం శివాలయం అర్చకులు విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ అలంకరణ చేపట్టారు. ప్రస్తుతం అమ్మవారి అలంకరణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరలక్ష్మీ వ్రతం రోజు ఈ ఒక్క పని చేస్తే కాసుల వర్షమే!