iDreamPost
android-app
ios-app

శుభవార్త.. వారికి గ్యాస్‌ సిలిండర్‌ ధరపై​ రూ.400 తగ్గింపు!

  • Published Mar 10, 2024 | 11:17 AM Updated Updated Mar 10, 2024 | 11:17 AM

LPG, Ujjwala Gas: గ్యాస్‌ ధరపై కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల గ్యాస్‌పై రూ.100 తగ్గించిన విషయం తెలిసిందే. ఈ తగ్గింపుతో కొంత మందికి దాదాపు 400 వరకు బెనిఫిట్స్‌ పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

LPG, Ujjwala Gas: గ్యాస్‌ ధరపై కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల గ్యాస్‌పై రూ.100 తగ్గించిన విషయం తెలిసిందే. ఈ తగ్గింపుతో కొంత మందికి దాదాపు 400 వరకు బెనిఫిట్స్‌ పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 10, 2024 | 11:17 AMUpdated Mar 10, 2024 | 11:17 AM
శుభవార్త.. వారికి గ్యాస్‌ సిలిండర్‌ ధరపై​ రూ.400 తగ్గింపు!

పెరుగుతున్న నిత్యవసర ధరలు పేద, మధ్యతరగతి కుటుంబాల వారిపై తీవ్ర ఆర్ధిక భారాన్ని మోపుతున్నాయి. రోజు రోజుకు ప్రతి వస్తువు ధర పెరిగిపోతూనే ఉంది. వాటికి తగ్గట్లు సంపాదన పెరగపోవడంతో సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు. వాటికి తోడు పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, అనారోగ్యాలు, పండగలు ఇలా ఏదో ఒక రూపంలో ఖర్చులు వారిని వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారికి కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. గ్యాస్‌ ధర తగ్గడం. తెలుగు రాష్ట్రాల్లో వంటగ్యాస్‌ ధర సిలిండర్‌కు రూ.960 వరకు ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 తగ్గించింది.

మార్చి 8న ఉమెన్స్‌ డే సందర్భంగా ప్రధాని మోదీ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 తగ్గించారు. ఈ తగ్గింపుతో కోట్ల మంది గ్యాస్‌ వినియోగదారులకు ఊరట లభించింది. అయితే.. ఈ వంద రూపాయాల తగ్గింపుతో ఓ క్యాటగిరికీ మరింత భారీ ఊరట లభించనుంది. వారు ఎవరంటే.. ఉజ్వల్‌ యోజనలో ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ పొందిన వారు ఈ తగ్గింపు పొందనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్యాస్‌ కనెక్షన్‌పై రూ.100 తగ్గింపు ఇచ్చింది. అంటే.. గ్యాస్‌ ధర ప్రస్తుతం రూ.860గా ఉంది. ఉజ్వల్‌ కనెక్షన్లు ఉన్న వారికి అదనంగా మరో రూ.300 సబ్సిడీ ఉంది.

ఉజ్వల్‌ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్న వారు ముందుగా రూ.860తో గ్యాస్‌ బుక్‌ చేసుకున్నా.. వారి ఖాతాలో రూ.300 సబ్సిడీ రూపంలో తిరిగి జమ అవుతాయి. అంటే.. ఈ రూ.300 సబ్సిడీతో పాటు తాజాగా తగ్గించిన రూ.100 తగ్గింపుతో ఉజ్వల్‌ గ్యాస​ కనెక్షన్లు ఉన్న వారికి రూ.400 తగ్గింపు పొందుతారు. దీంతో.. వారికి గ్యాస్‌ కేవలం రూ.560లకే అందనుంది. మరి ఈ తగ్గింపు, సబ్సిడీతో పేద మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట లభించిందనే చెప్పాలి. మరి ఈ గ్యాస్‌ ధరలపై, అలాగే తగ్గింపులు, సబ్సిడీలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.