iDreamPost
android-app
ios-app

మా భర్త మూడో పెళ్లికి రండి.. శుభలేఖలు పంచిన ఇద్దరు భార్యలు!

  • Published Jun 30, 2024 | 4:31 PM Updated Updated Jun 30, 2024 | 4:31 PM

Wives Support To Husband's 3rd Marriage: ఎక్కడైనా భర్త వేరే అమ్మాయిని చూస్తేనే తట్టుకోలేరు. అలాంటిది ఇక్కడ ఇతని భార్యలు మూడో పెళ్ళికి ఒప్పుకున్నారు. ముందు ఒకరిని.. ఆ తర్వాత ఆమెను ఒప్పించి మరొకర్ని.. ఇప్పుడు వీరిద్దరినీ ఒప్పించి వేరొక మహిళను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు భార్యల ముద్దుల భర్త ఇప్పుడు ముగ్గురు భార్యల ముద్దుల మొగుడయ్యారు.

Wives Support To Husband's 3rd Marriage: ఎక్కడైనా భర్త వేరే అమ్మాయిని చూస్తేనే తట్టుకోలేరు. అలాంటిది ఇక్కడ ఇతని భార్యలు మూడో పెళ్ళికి ఒప్పుకున్నారు. ముందు ఒకరిని.. ఆ తర్వాత ఆమెను ఒప్పించి మరొకర్ని.. ఇప్పుడు వీరిద్దరినీ ఒప్పించి వేరొక మహిళను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు భార్యల ముద్దుల భర్త ఇప్పుడు ముగ్గురు భార్యల ముద్దుల మొగుడయ్యారు.

మా భర్త మూడో పెళ్లికి రండి.. శుభలేఖలు పంచిన ఇద్దరు భార్యలు!

ప్రపంచంలో ఎంతోమంది జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి ఒక్క నా జీవితంలో తప్ప అని ఓ సినిమాలో రావు రమేష్ అన్నట్టు.. ఎంతోమందికి గాని రాని అదృష్టం ఈ వ్యక్తికి వచ్చింది. పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూస్తేనే సహించలేని భార్య.. మరొక అమ్మాయితో పెళ్లి అంటే ఊరుకుంటుందా? చీల్చి చెండాడేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా విచిత్రం. భార్య రెండో పెళ్ళికి ఒప్పుకోవడం, మరలా ఆ ఇద్దరు భార్యలు భర్త మూడో పెళ్ళికి ఒప్పుకోవడం. భార్య అంటే హస్బెండ్ తప్పు చేస్తే బెండు తీసే విధంగా కదా ఉండాలి. ఇదే కదా రూలు. ఇంట్లో ఇల్లాలు ఉండగా భర్త వేరే మహిళను చూసినా, పెళ్లి చేసుకుంటా అన్నా గొడవలు అవుతాయి. కానీ ఇక్కడ మాత్రం విచిత్రం. ఇద్దరు భార్యలు భర్త మూడో పెళ్ళికి అంగీకరించారు. అంతేనా.. దగ్గరుండి మరీ పెళ్లి శుభలేఖలు పంచుతూ అతిథులను ఆహ్వానిస్తున్నారు. 

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కించూరు గ్రామంలో ఉంటున్న సాగేని పండన్నకి పార్వతమ్మతో మొదటి పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఆమెను ఒప్పించి అప్పలమ్మ అనే ఆమెని రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరు భార్యల ముద్దుల మొగుడిగా ఉంటూ సంసార సాగరాన్ని ఈదుతున్నారు పండన్న. అలా వీరి కుటుంబం ఒక భర్త, ఇద్దరు భార్యలతో హ్యాపీగా సాగిపోతుంది. ఆ సమయంలో పండన్న జీవితంలోకి లక్ష్మీ అనే మహిళ వచ్చింది. పండన్న ఆమెపై మనసు పారేసుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని తన భార్యలిద్దరికీ చెబితే వాళ్ళు అంగీకరించారు. ఈ పెళ్ళికి పెద్దలుగా ఆ ఇద్దరు భార్యలు ఉండడం విశేషం. పండన్నకు అమ్మానాన్న ఎవరూ లేకపోవడంతో భార్యలే పెళ్లి పెద్దలుగా మారారు. లక్ష్మీ ఇంట్లో పెద్దవాళ్ళని పండన్న భార్యలే ఒప్పించారు.

Wifes did 3rd marrige to husband

లక్ష్మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. పెళ్లి ఖాయం అవ్వడంతో ముహూర్తం ఫిక్స్ చేసి శుభలేఖలు కూడా ముద్రించారు. పార్వతమ్మ, అప్పలమ్మ ఈ ఇద్దరూ తమ భర్త మూడో పెళ్ళికి ఆహ్వానిస్తున్నట్లు శుభలేఖలో ముద్రించారు. మీ రాకను ప్రేమతో ఆహ్వానిస్తున్నామని ముద్రించారు. కాగా ఈ పెళ్లి జూన్ 25న ఉదయం 10 గంటలకు జరిగింది. నవ వధువు లక్ష్మీ తరపు బంధువులు, పాత వరుడు పండన్న బంధు మిత్రులు, గ్రామ పెద్దలు ఏ పెళ్ళికి వచ్చి దంపతులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి కార్డు ఇప్పుడు బయటకు రావడంతో నెటిజన్స్.. ఎంత లక్కీ మావ నువ్వు.. ఇలాంటి భార్యలు ఉంటే నిత్యపెళ్లికొడుకులా ఉండచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Jojobet GirişmeritbetcasibomCasibomcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş