iDreamPost
android-app
ios-app

తిరుమల వెళ్లే వారికి శుభవార్త.. క్యూ లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే?

  • Published Feb 05, 2024 | 9:13 AM Updated Updated Feb 05, 2024 | 9:22 AM

Tirumala Tirupati Devasthanams: తిరుమలకు నిత్యం వేల సంఖ్యల్లో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారు.. అలాంటి వారికోసం టీటీటీ గుడ్ న్యూస్ చెప్పింది.

Tirumala Tirupati Devasthanams: తిరుమలకు నిత్యం వేల సంఖ్యల్లో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారు.. అలాంటి వారికోసం టీటీటీ గుడ్ న్యూస్ చెప్పింది.

  • Published Feb 05, 2024 | 9:13 AMUpdated Feb 05, 2024 | 9:22 AM
తిరుమల వెళ్లే వారికి శుభవార్త.. క్యూ లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే?

తిరుమల తిరుపతి దేవస్థానం భారత దేశంలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల పుణ్యక్షేత్రం. తిరుమలను కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. స్వామి వారు స్వయం వ్యక్తమై వెలసిన పుణ్యక్షేత్రం కావడంతో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు నిత్యం లక్షల సంఖ్యలో స్వామి వారి దర్శనం కోసం ఇక్కడికి తరలివస్తుంటారు. దేశం నుంచే కాదు.. విదేశాల నుంచి కూడా పర్యాటకులు నిత్యం ఇక్కడికి వస్తుంటారు. తిరుమల ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల తో కిట కిటాడుతుంది. చాలా వరకు భక్తులు స్వామి వారి దర్శనం టికెట్ల కోసం క్యూ లైన్లో నిలబడాల్సి ఉంటుంది.. అలాంటి వారి కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త అందించింది తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).  తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను ఇకపై భక్తులు ఆన్ లైన్ లో కొనుగోలు చేసే అవకాశం టీటీడీ కల్పించనుంది. ఇప్పటికే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది. ఎంబీసీ 34 లోని కౌంటర్ వద్ద టికెట్ల కోసం భక్తులు చాలా వరకు క్యూ లైన్ లో నిరీక్షించాల్సిన పరిస్తితి ఉంటుంది. ఈ ఇబ్బందులు తొలగించడానికి టీటీడీ నూతన విధానం అమలు చేసేందుకు సిద్దమైంది. సాధారణంగా వీఐపీలు ఎక్కువగా సిఫార్సులపైనే వెళ్తుంటారు. అలాంటి సిఫార్సు లేఖలు అందజేసిన భక్తులకు మొబైల్ కి ఓ లింక్ తో కూడిన మెసేజ్ వెళ్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేస్తే.. పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఆ పేమెంట్ చెల్లిస్తే.. ఆన్ లైన్ లో టికెట్ డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది.

గతంలో పలు కౌంటర్ల వద్ద భారీగా క్యూ లైన్లో నిలబడి దర్శనం టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. టెక్నాలజీ వచ్చిన తర్వాత టీటీడీ ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఆన్ లైన్ లో టికెట్ డౌన్ లోడ్ విధానం టీటీడీ రెండు రోజుల నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది. ఈ విధానంపై భక్తుల అభిప్రాయాలను కూడా సేకరిస్తుంది. ఈ నేపథ్యంలోనే తుది నిర్ణయాయిని టీటీడీ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలలో తిరుమల తిరుపతి వెళ్లాలనుకునే వారు ఈ ఆప్షన్ చెక్ చేసుకోవాలి.  ఏది ఏమైనా స్వారి వారి దర్శనం టికెట్ ఈ విధంగా లభించడంపై భక్తులు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigboss