హోమ్ సిక్ సెలవులతో ఇంటికెళ్లాలనుకుంది.. అంతలోనే!

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు వెన్నెల. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ తిరుపతిలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అయితే ఇటీవల కాలేజీ యాజమాన్యం హోమ్ సిక్ సెలవులు ఇచ్చింది. దీంతో ఆ బాలిక మరో స్నేహితురాలితో కలిసి ఇంటి వెళ్లాలని భావించింది. ఇక ఇందులో భాగంగానే ఈ నెల 22న బస్సుకెక్కింది. తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు కూడా సంతోషపడ్డారు. కూతురి రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తూ కూర్చున్నారు. కానీ, ఓ గంటలో ఆ తల్లిదండ్రులు కూతురి గురించి ఏం వార్త అందిందో తెలిస్తే అస్సలు నమ్మలేరు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం చింతలకుంట గ్రామానికి చెందిన పుప్పు వెన్నెల అనే బాలిక తిరుపతిలోని ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే, కాలేజీ యాజమాన్యం ఇటీవల హోమ్ సిక్ సెలవులు ఇవ్వడంతో వెన్నెల ఇంటికి వెళ్లాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఈ నెల 22న తిరుపతిలో తన మరో స్నేహితురాలితో కలిసి బస్సెక్కారు. అలా వీరు ప్రయాణిస్తున్న బస్సు కొద్ది దూరం వెళ్లిందో లేదో వెనకాల నుంచి ఓ లారీ వేగంగా వీరి బస్సును ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో వెన్నెలతో పాటు చాలా మంది గాయపడ్డారు. పోలీసులు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ విషయం వెన్నెల తల్లిదండ్రులకు తెలియడంతో షాక్ గురై వెంటనే తిరుపతికి చేరుకున్నారు. ఆస్పత్రిలో కూతురుని ఆ స్థితిలో చూసి ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక వెన్నెల ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లిందని వైద్యులు తెలిపారు. అలా వెన్నెల ఆస్పత్రికి లో ఏకంగా 9 రోజుల పాటు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కూతురు మరణవార్తతో వెన్నెల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. దీంతో వీరి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుమకున్నాయి.

ఇది కూడా చదవండి: అత్తపై మోజుపడ్డ అల్లుడు.. కోరిక తీర్చలేదని చంపేశాడు!

Show comments