iDreamPost
android-app
ios-app

తిరుపతి జూ పార్క్ లో విషాదం.. వ్యక్తిని చంపిన సింహం!

  • Published Feb 15, 2024 | 5:33 PM Updated Updated Feb 15, 2024 | 5:33 PM

Tirupati Zoo Park: తిరుపతిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ కు వెళ్లిన పర్యాటకులు షాక్ కి గురయ్యే ఘటన జరిగింది. గతంలో ఓ చిన్నారిపై పులి దాడి చేసిన ఘటన మరవక ముందే..అదే తరహాలో మరొకటి చోటుచేసుకుంది.

Tirupati Zoo Park: తిరుపతిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ కు వెళ్లిన పర్యాటకులు షాక్ కి గురయ్యే ఘటన జరిగింది. గతంలో ఓ చిన్నారిపై పులి దాడి చేసిన ఘటన మరవక ముందే..అదే తరహాలో మరొకటి చోటుచేసుకుంది.

  • Published Feb 15, 2024 | 5:33 PMUpdated Feb 15, 2024 | 5:33 PM
తిరుపతి జూ పార్క్ లో విషాదం.. వ్యక్తిని చంపిన సింహం!

ఇటీవల కాలంలో  వన్యమృగాలు జనవాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా సింహం, పులి వంటి క్రూర మృగాలు గ్రామాలు, పట్టణాల్లో సంచరిస్తున్నాయి. గతంలో తిరుపతి శ్రీవారి మెట్ల ప్రాంతంలో పులి సంచరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టీటీడీ సైతం భక్తుల భద్రత విషయంలో గట్టి చర్యలు తీసుకుంది. అలానే నిన్న బుధవారం శ్రీశైల పుణ్యక్షేత్రంలోని రెడ్ల సత్రం సమీపంలో పులి సంచరించింది. ఇలా అడవి మృగాలు సంచరించడమే కాకుండా మనుషులపై దాడి చేసి చంపేస్తున్నాయి. తాజాగా తిరుపతిలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది.

కొన్నినెలల క్రితం తిరుపతిలో ఓ బాలికపై పులి దాడి చేసిన ఘటన అందరికి తెలిసిందే. ఆ ఘటనలో చిన్నారి మృతి చెందడం అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా తిరుపతి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. తిరుపతి జూ పార్క్ లో ఘోరం చోటుచేసుకుంది. శ్రీ వెంకటేశ్వర జూ పార్కులో ఓ వ్యక్తిపై సింహం దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. జూ పార్క్ కి వెళ్లిన బాధితుడు సింహం ఉన్న ఎన్ క్లోజర్ లోకి దూకినట్లు సమాచారం. దీంతో అతడిపై సింహం దాడి చేయగా.. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడిని చంపేసిన అనంతరం నోట పట్టుకుని వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నాడు.

మృతుడు రాజస్థాన్ కు చెందిన  ప్రహ్లాద్ గుర్జర్ గా అధికారులు గుర్తించారు. ఇక స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రహ్లాద్ గేటును దాటుకుని లోనికి వెళ్లి..సింహాలకు ఆహారం అందించే ప్రాంత వద్దకు వెళ్లాడని, అక్కడి నుంచి బోనులోకి దూకినట్లు తెలుస్తోంది.  ఈ ఘటన తరువతా జూ పార్క్ సిబ్బంది సింహాన్ని ఎన్ క్లోజర్ లో ఉన్న కేజ్ లో బంధించారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సింహం దాడిలో వ్యక్తి చనిపోయిన ఘటన సందర్శకులను భయాందోళనకు గురిచేసింది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş