Arjun Suravaram
ఓ వివాహిత కూడా భర్త,పిల్లలతో ఎంతో సంతోషంగా ఉంది. కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ఇలా సాగుతున్న ఆమె సంసార జీవితంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.
ఓ వివాహిత కూడా భర్త,పిల్లలతో ఎంతో సంతోషంగా ఉంది. కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ఇలా సాగుతున్న ఆమె సంసార జీవితంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.
Arjun Suravaram
ప్రతి ఒక్కరికి అందమైన, సంతోషకరమైన జీవితం కావాలని కోరిక ఉంటుంది. అయితే కొందరికి మాత్రమే దేవుడు అలాంటి అవకాశం ఇస్తాడు. ముఖ్యంగా మహిళలు.. తన భర్త, పిల్లలతో సంతోషంగా ఉంటూ సంసారం సాగాలానే కోరుకుంటారు. అలానే ఓ వివాహిత కూడా భర్త,పిల్లలతో ఎంతో సంతోషంగా ఉంది. కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ఇలా సాగుతున్న వారి సంసార జీవితంలో విషాదం చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుక కోసం భర్తతో కలిసి బయటకి వెళ్లిన ఆ వివాహిత విగతజీవిగా మారింది. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఏపీలోని పార్వతీపురం మన్య జిల్లా కొత్తవలస మండలం చీపురువలసకు చెందిన సత్యనారాయణ, మాధవి(30) భార్యాభర్తలు. వీరు ఎంతో సంతోషంగా,హాయిగా జీవిస్తున్నారు. వీరికి పదేళ్లలోపు వయస్సున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. సత్యనారాయణ కార్పెంటర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మాధవి టైలరింగ్ పని చేస్తూ భర్తకు, కుటుంబానికి ఆర్థికంగా సాయపడుతోంది. ఇలా వచ్చిన సంపాదనతో వారు నలుగురు ఎంతో హాయిగా జీవిస్తున్నారు. అయితే ఆదివారం జరిగిన అనుకోని ఓ ఘటన వారి ఇంట విషాదం నింపింది.
ఆదివారం విశాఖపట్నం జిల్లా అక్కిరెడ్డిపాలెంలో మాధవి వాళ్ల బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడక జరుగుతోంది. ఆ వేడుకకు హాజరయ్యేందుకు సత్యానారాయణ, మాధవి, ఇద్దరు పిల్లలతో కలిసి బైక్ పై బయలు దేరారు. పెందుర్తి మండలం జంగాలపాలెం చేరుకునే సరికి అడ్డంగా సత్యనారాయణ నడుపుతున్న బైక్ కి మరో బైక్ అడ్డు వచ్చింది. ఇలా అకస్మాత్తుగా బైక్ అడ్డు రావడంతో ఒక్కసారిగా సత్యనారాయణ బ్రేక్ వేశారు. దీంతో వెనుక కూర్చున్న మాధవి జారి రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ మాధవిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అందించిన సమాచారంతో 108 వాహనం అక్కడి చేరుకుంది. తీవ్రంగా గాయపడిన మాధవిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
108 వాహనంలో విశాఖకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. దీంతో మృతురాలి కుటుబం సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇద్దరు పిల్లలు తల్లిలేని వారిగా మిగిలిపోయారు. మరికాసేపట్లో పుట్టిన రోజులో వేడుకలో పాల్గొనాల్సి మాధవి… విగతజీవిగా మారడం అందరిని కలచివేసింది. ఇలా తరచూ జరిగే ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు చీకట్లో పడిపోతున్నాయి. కుటుంబ పెద్ద మరణించడంతో రోడ్డుపన పడుతున్నారు. కొందరి నిర్లక్ష్యానికి అమాయకులు బలవుతున్నారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న కొందరి వాహనదారుల నిర్లక్ష్యం, ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.