Arjun Suravaram
గురువారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు 28వ వర్ధంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు పెద్దఎత్తున వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి తరానికి తెలియని ఆయన చేదు జ్ఞాపకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
గురువారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు 28వ వర్ధంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు పెద్దఎత్తున వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి తరానికి తెలియని ఆయన చేదు జ్ఞాపకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Arjun Suravaram
నేడు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు 28వ వర్థంతి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఆ మహానాయకుడిని స్మరించుకుంటున్నారు. అలానే అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాట్‌కి వళ్లి నివాళులు అర్పిస్తున్నారు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి.. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. రాజకీయంగా, సామాజికంగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ఎన్టీఆర్ ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారని అభిమానలు తెలిపారు. ఆలాంటి మహానీయుడి జీవితంలో గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలు కొన్ని మీ కోసం.
అది 1996 సంవత్సరం జనవరి 19న ఎప్పటిలాగే తెల్లారింది. సైకిల్ పై న్యూస్ పేపర్ అరుగు వద్దు ఇచ్చే కుర్రాడి ముఖం ఎర్రబడింది. గుండెలోని బాధని నోటి వద్దనే ఆపుకుని పత్రికను అరుగుపై ఉన్న పెద్దాయనికి ఇచ్చాడు. అయితే ఏమైందిరా ఇంట్లో వాళ్లు ఏమైన పోయ్యారా మొహం పెట్టావు అంటూ కుర్రాడిని అడిగాడు. అదే సమయంలో పేపర్ అందుకున్న పెద్దాయన దానిని ఓపెన్ చేసి చూడగానే అయ్యో అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో మొయిన్ పేజిలోని వార్త అందరికీ కనబడింది. అది ఏమిటంటే.. ఐదు కోట్ల ఆంధ్రుల అన్న ఎన్టీఆర్ ఇక లేరని అందులో ఉంది.
ఇక ఎన్టీఆర్ మృతి తెలిసి కోట్లాది మంది గుండెలు పగిలేలా రోధించారు. జీవన చరమాంకంలో తోడు నీడ కోసం ధర్మపత్నిగా స్వీకరించిన లక్ష్మిపార్వతి.. ఆయన హఠాన్మరణంతో దిగ్బ్రాంతికి లోనయ్యారు. నన్ను కూడా మీతో తీసుకెళ్లండి అని ఆయన మీదబడి విలపిస్తూ కుప్పకూలిపోయింది. ఇక రామారావు మరణవార్తె తెలిసి విదేశాల్లో ఉన్న హరికృష్ణ హుటాహుటినా స్వదేశానికి వచ్చారు. ఇక తండ్రి మృతదేహం చూసి హరికృష్ణ బోరుమంటూ కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాకుండా అప్పటి వరకు ఎన్టీఆర్ భౌతిక కాయం వద్ద ఉన్న లక్ష్మిపార్వతిని దూరం చేశారు. అంతేకాక తన తండ్రిని పాయిజాన్ తో చంపేశారని ఆరోపించటంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చంద్రబాబు ఎన్టీఆర్ ఇంటి వద్దకు రాగానే ఆయన అభిమానులు, ఎన్టీఆర్ తో మిగిలి ఉన్న నేతలు బాబు రావటానికి వీళ్లేదంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే కోపోద్రేకులైన అభిమానులు అందుకు కారకుడుగా చంద్రబాబును భావించారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థలపై రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా దాడు ప్రయత్నాలకు ప్రయత్నించారు. నెల్లూరు జిల్లాలో రెండు హెరిటేజ్ వ్యాన్లను తగల బెట్టడంతో రాష్ట్రంలోని అన్ని హెరిటేజ్ ప్లాంట్ వద్ద వద్ద పోలీసు బందోబస్తూ ఏర్పాటు చేశారు. అలానే ఎన్టీఆర్ అంతిమయాత్ర కార్యక్రమాల నిర్వహణ పై ఎన్టీఆర్ వర్గానికి, బాబు వర్గానికి మధ్య ఆధిపత్య పోరు జరిగింది. చివరకు ఆయన ఆఖరి మజిలీ కూడా ప్రశాంతంగా జరగకుండా పలు అపశృతులకు, పలు గొడవలకు వేదికగా మార్చి ఆయన అభిమానుల చీత్కారాలను ఎదుర్కొన్నారు.
రామారావు మృతికి చంద్రబాబులే కారణమని వెన్నుపోటు పొడిచి పదవి, పార్టీ, గుర్తులు లాక్కోవటం వలనే క్షోభకి గురయ్యి చనిపోయారని ఎన్టీఆర్ వర్గం ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు. దమ్ముంటే న్యాయ విచారణ జరపాలని ఎన్టీఆర్ వర్గ ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేశారు. రామారావు అంత్యక్రియలు జరుగుతుండగానే ఆయన ఇంటిలో పడక గదిలో ఉన్న డబ్బు, బంగారం కోసం ఆయన బంధువులు, చంద్రబాబు వర్గంలోని ఎమ్మెల్యేలు పలువురు ఆ ఇంట్లోని లక్ష్మీపార్వతితో, ఇతర ఎన్టీఆర్ వర్గ నాయకులతో గొడవ పడ్డారు. అంతటితో సంతృప్తి చెందక ఇదే అంశంపై పదే పదే ఒత్తిళ్ళు తేవడం, దౌర్జన్యాలు చేయడం జరిగాయి. చంద్రబాబు వర్గం నుంచి వస్తున్న దాడులకు బెంబేలెత్తిన లక్ష్మీపార్వతి కోర్టుని ఆశ్రయించారు. దీంతో కోర్టు లక్ష్మీపార్వతికి కేంద్ర రక్షణ బలగాలతో రక్షణ కల్పించింది.
ఇదే సమయంలో చంద్రబాబు.. పోయినాయన ఎటూ పోయాడు మనం కలిసి పని చేద్దామని ఎన్టీఆర్ వర్గాన్ని తన వర్గంలో కలుపుకొనే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ మృతి పై విచారణ జరిపించాలని హరికృష్ణ డిమాండ్ చేశారు. అయితే దానికి చంద్రాబు ఒప్పుకోకుండా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుందామని తెలిపారు. విచారణ జరిపితే ఎన్టీఆర్ మృతి వెనక ఉన్న వాస్తవాలు, ఇతర రహస్యాలు బయటకి వస్తాయన్న భయంతోనో అలా చంద్రబాబు చెప్పారు. అయితే కేబినెట్ చేత తీర్మాణం చేయించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన హరికృష్ణ తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు.
రామారావు మృతి అనంతరం చెలరేగిన అంతర్గత వివాదాలన్ని కొంచెం తగ్గు ముఖం పట్టాక చంద్రబాబు మీడియా ముందుకు వచ్చారు. అంతేకాక ఎన్టీఆర్ పేదల కోసం పని చేసిన దేవుడని ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తానంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు. చంద్రబాబు మాటలకు ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి.. ఎన్టీఆర్ మరణించిన సమయంలో జరిగిన ఈ చేదు జ్ఞాపకాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.