Arjun Suravaram
కొందరు రాజకీయనేతలు ప్రచారా పిచ్చి పీక్ స్టేజ్ లో ఉంటుంది. ఆ ప్రచార యావతో చేసే పనులు కొందరి ప్రాణాలను బలి తీసుకుంటాయి. ఇలాంటి ఘటనలు అనేకం జరగ్గా..తాజాగా అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
కొందరు రాజకీయనేతలు ప్రచారా పిచ్చి పీక్ స్టేజ్ లో ఉంటుంది. ఆ ప్రచార యావతో చేసే పనులు కొందరి ప్రాణాలను బలి తీసుకుంటాయి. ఇలాంటి ఘటనలు అనేకం జరగ్గా..తాజాగా అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
Arjun Suravaram
రాజకీయాల్లో ప్రచారం అనేది చాలా కీలకమైనది. అయితే కొందరు నేతలకు ప్రచార యావ ఎక్కువగా ఉంటుంది. ఈక్రమంలో తాము ఏం చేస్తున్నామనే విషయం మర్చి.. చాలా మంది అమాయకల ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంటారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విషయంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. గోదావరి పుష్కరాలు, కందుకూరులో నిర్వహించిన సభలో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో టీడీపీ నేత ప్రచార యావకు ఓ నిండు ప్రాణం బలైంది. ఇంటి పెద్ద దిక్కు మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేని వారయ్యారు. వివరాల్లోకి వెళ్తే..
ఇటీవలే టీడీపీ,జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా బండారు శ్రావణి శ్రీని ప్రకటించారు. దీంతో అనంతపురం పట్టణంలోని అరవింద నగర్‌లో ఉన్న ఆమె నివాసం వద్ద భారీ కటౌట్‌లు, ఫ్లెక్సీలు కట్టాలని నిర్ణయించారు. ఆమె అనుచరులు రాజు, మేదర కాకర్ల దుర్గన్నకు పని అప్పగించారు. వీరు ప్లెక్సీలు కట్టేందుకు మరువకొమ్మ కాలనీకి చెందిన కూలీ సాకే రాజు(40)ను ఆశ్రయించారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, రాలేను, పైగా శ్రావణి ఇంటి పైనే 11 కేవీ విద్యుత్ లైన్ వెళ్తుందని తెలిపాడు. అక్కడ కటౌట్‌లు కడితే ప్రమాదమని రాజు చెప్పినా వినకుండా ఎలాగైనా రావాలి అంటూ ఆమె అనుచరలు పురమాయించారని సమచారం. ఈ క్రమంలోనే సాకే రాజు, మరో వ్యక్తి సలీంతో కలిసి బుధవారం శ్రావణి ఇంటి వద్దకు ప్లెక్సీలు కట్టేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో సలీం కూడా గాయపడ్డాడు. సాకే రాజు మృతి చెందిన విషయాన్ని కనీసం కుటుంబీకులకు సైతం టీడీపీ నాయకులు తెలియజేయలేదు. మృతదేహాన్ని ఓ వాహనంలో ఎక్కించి సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. మార్చురీ వద్ద రాజుకు తెలిసిన వ్యక్తి .. అతడి మృతదేహాన్ని చూశారు. అతడు ఇచ్చిన సమాచారంతో మృతుడి భార్య లక్ష్మీదేవి తన నలుగురు పిల్లలతో ఆస్పత్రికి హుటాహుటిన చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి గుండెలవిసేలా రోదించారు. ఇక తమకు దిక్కెవరయ్యా అంటూ భార్య భోరున విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
తన భర్త ముందే హెచ్చరించినా, పనికి తీసుకెళ్లి ప్రాణాలు తీశారని సాకే రాజు భార్య లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అనంతపురం టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన ఇంటిపై భారీ కరెంట్ లైను వెళ్తోందని తెలిసినా.. శ్రావణి నిర్లక్ష్యంగా వ్యవహరించి రాజు మృతికి కారణమయ్యారని పలువురు విమర్శించారు. కనీసం మృతుడి కుటుంబాన్ని ఆమె పరామర్శించకపోవడాన్ని తప్పుబట్టారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేశారు.