iDreamPost
android-app
ios-app

స్కూల్ నుంచి వెళ్లి.. గ్యాస్‌ డెలివరీ బాయ్‌ ఇంట్లో ఆ స్థితిలో కనిపించింది..!

  • Published Jul 16, 2024 | 9:32 AM Updated Updated Jul 16, 2024 | 10:41 AM

Guntur Crime News: ఇటీవల దేశంలో మహిళలకు అస్సులు రక్షణ లేకుండా పోతుంది. ఒంటరిగా కనిపించే ఆడవాళ్లపై అత్యాచారాలు, హత్యలకు పాల్పపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు.

Guntur Crime News: ఇటీవల దేశంలో మహిళలకు అస్సులు రక్షణ లేకుండా పోతుంది. ఒంటరిగా కనిపించే ఆడవాళ్లపై అత్యాచారాలు, హత్యలకు పాల్పపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు.

స్కూల్ నుంచి వెళ్లి.. గ్యాస్‌ డెలివరీ బాయ్‌ ఇంట్లో ఆ స్థితిలో కనిపించింది..!

ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఓ ఏనిమిదేళ్ల బాలికపై మైనర్లు అతి దారుణంగా అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఆ బాలిక మృతదేహం కూడా లభ్యం కాలేదు. ఇలాంటి దారుణాలు దేశ వ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తమ గుట్టు ఏక్కడ బయట పడుతుందో అని హత్యలకు పాల్పపడుతున్నారు. 8వ తరగతి ఓ విద్యార్థిని స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గాలించగా అదే ఊర్లో గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో దారుణమైన స్థితిలో కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలేనికి చెందిన శైలజ(13) అనే బాలిక ఎనిమిదవ తరగతి చదువుతుంది. స్కూల్ నుంచి బయలుదేరిన బాలిక అదే గ్రామంలోని గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో మంచంపై అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. శైలజ మెడపై గాయాలు కనిపించడంతో హత్యకు గురై ఉండొచ్చని భావించారు. శైలజ, ఆమె అన్నయ్య సోమవారం ఉదయం స్కూల్ కి వెళ్లారు. సాయంత్రం శైలజ అన్నయ్య ఒక్కడే ఇంటికి తిరిగి వచ్చాడు. చెల్లి వెంట రాలేదు ఎందుకు అని తల్లి ప్రశ్నించగానే వెంటనే స్కూల్ కి వెళ్లి టీచర్ ని అడిగాడు. ఒంట్లో బాగాలేదని చెప్పి మధ్యాహ్నమే వెళ్లిపోయిందని చెప్పాడు ఉపాధ్యాయుడు. ఈ విషయం తల్లితో చెప్పాడు ఆమె అన్నయ్య. కంగారు పడ్డ శైలజ తల్లి స్థానికులతో కలిసి గ్రామంలో వెతికారు.

ఈ క్రమంలోనే గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంటి వద్ద చెల్లెలు చెప్పులు కనిపించడంతో ఆ ఇంటి కిటికీలో నుంచి చూశారు. మంచంపై శైలజ విగతజీవిగా పడి ఉండటం గమనించాడు  అన్నయ్య. వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో తాళం పగలగొట్టి..బాలికను బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలికను గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. అప్పటికే బాలిక చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. కాగా, నాగరాజుకు పెళ్లయినప్పటికీ మూడేళ్ళుగా ఒంటరిగా ఉంటున్నాడని స్థానికులు చెప్పారు. తల్లిదండ్రులు నాగరాజుపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.