iDreamPost
android-app
ios-app

ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి .. ఆమె చేసిన పనికి అందరు షాక్!

ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి .. ఆమె చేసిన పనికి అందరు షాక్!

ప్రేమ  అనే రెండు అక్షరాల పదం ఎప్పుడు, ఎవరి మధ్య, ఎలా పుడుతుందో చెప్పలేము. అయితే ఈ ప్రేమల్లో 90 శాతం విఫలం కాగా, 10 శాతం మాత్రమే విజయం సాధిస్తున్నాయని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా ప్రేమికుల్లోని కొందరు పెళ్లి చేసుకున్న తరువాత కొంతకాలనికి వారి నిజస్వరూపం చూపిస్తారు. వివిధ కారణాలతో భాగస్వామిని వేధింపులకు గురి చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు వివాహితలు క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు. చంపడం లేదా చావడం వంటివి చేస్తుంటారు. తాజాగా ఓ వివాహిత కూడా ప్రేమించి మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. అత్తింటి వారి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు , పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

కుమురం భీమ్ జిల్లా వాంకిడి మండలం తేజిగూడ గ్రామానికి చెందిన బాలజీ, సుమిత్ర దంపతులు ఉన్నారు. వారికి అంజలి(18)  అనే కుమార్తె ఉంది. ఆమె అదే గ్రామానికి చెందిన  ఆదె శంకర్ ప్రేమించుకున్నారు. మొదట్లో ఇరు కుటుంబాల సభ్యులు ఒప్పుకోలేదు. అనంతరం వారిద్దరి మాటలకు రాజీకి వచ్చి వివాహానికి ఒప్పుకున్నారు.  అంజలి మైనర్ కావడంతో అధికారులకు తెలియకుండా మూడేళ్ల క్రితం వివాహం జరిపించారు.  పెళ్లి సమయంలో శంకర్ కు రూ.లక్ష కట్నం  ఇచ్చారు. ప్రస్తుతం అంజలి,శంకర్ లకు  రక్షిత అనే కుమార్తె ఉంది.

తొలుత అంజలని బాగా చూసుకున్న అత్తింటి వారు.. కూతురు పుట్టిన తరువాత వేధింపులకు గురి చేశారు. మరో లక్ష రూపాయలు, , వ్యవసాయ భూమిని తీసుకురావాలని అంజలిని హింసించే వారు.  అంతేకాక అంజలిని… ఆమె పుట్టింటికి వెళ్లనీయకుండా, ఎవరితో మాట్లాడనీయకుండా బెదిరింపులకు గురి చేసేవారు. ఈ బాధలు భరించలేకపోయిన అంజలి.. సోమవారం  తెల్లవారుజామున సమయంలో ఇంట్లోని  ఓ గదిలో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు  తెలిపారు.  సమాచారం అందుకున్న మృతురాలి తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకుని రోదించారు. తమ కుమార్తెను అత్తమామ, భర్త, మరిదిల వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య  చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.

మృతురాలి భర్త శంకర్, మామ, అత్త, మరిది సోమయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతురాలి కాళ్లు నేలకు తాకి ఉండటాన్ని బట్టి.. అత్తింటివారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని అంజలి తరపు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ప్రేమించిన వ్యక్తితో కొత్త జీవితాన్ని ఊహించుకున్న యువతి.. మూడేళ్లకే నిండు నూరేళ్లు నిండాయి. మరి..  ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భర్తకు తలకొరివి పెట్టిన భార్య.. కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన!

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş