పేరుకేమో ఇంటర్నేషనల్ స్కూల్.. వార్డెన్ రూం చూస్తే మద్యం షాపే

అది పేరుకు పెద్ద స్కూల్.. అలాంటి ఇలాంటి స్కూల్ కూడా కాదండోయ్.. ఇంటర్నేషనల్ స్కూల్. అందులో హాస్టల్ వసతి కూడా ఉంది. పిల్లలు బాగా చదువుకుంటారన్న ఉద్దేశంతో ఆ పాఠశాలలో జాయిన్ చేశారు తల్లిదండ్రులు.. కానీ..

అది పేరుకు పెద్ద స్కూల్.. అలాంటి ఇలాంటి స్కూల్ కూడా కాదండోయ్.. ఇంటర్నేషనల్ స్కూల్. అందులో హాస్టల్ వసతి కూడా ఉంది. పిల్లలు బాగా చదువుకుంటారన్న ఉద్దేశంతో ఆ పాఠశాలలో జాయిన్ చేశారు తల్లిదండ్రులు.. కానీ..

జ్ఞానాన్ని బోధించి.. దేశానికి మంచి పౌరులను అందించే కేంద్రాలు విద్యాలయాలు. విద్యా బుద్దులు నేర్పాల్సిన ప్రాంగణంలో వికృత చేష్టలు చేస్తున్నారు కొందరు. ముఖ్యంగా విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. బస్సు డ్రైవర్, స్కూల్ మాస్టార్స్, వార్డెన్స్ విద్యార్థులను హింసకు గురి చేస్తుంటారు. భయంతోనో లేక మార్కులు తక్కువ ఇస్తారనే ఉద్దేశంతో కిక్కురుమనకుండా ఉండిపోతున్నారు విద్యార్థులు. తాజాగా ఏపీలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థ చేస్తున్న నిర్వాకం బయటపడింది. బయటకు మాత్రం పెద్ద ఇంటర్నేషన్ స్కూల్. లోపల మాత్రం అదొక నరకకూపం. ఎవ్వరికీ చెప్పుకోలేక.. తెగించి.. తల్లిదండ్రులకు స్టూడెంట్స్ మొరపెట్టుకోవడంతో ఈ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారం బయటకు వచ్చింది.

అనంతపురం రూరల్ మండలం కొడిమి సమీపంలో సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇంటర్నేషనల్ స్కూల్ అనగానే.. ఉన్నత విద్య, మంచి స్కిల్స్, మౌలిక సదుపాయాలు బాగుంటాయి అన్న ఉద్దేశంతో ఆ పాఠశాలలో జాయిన్  చేశారు తల్లిదండ్రులు. అందులో హాస్టల్ వసతి కూడా ఉండటంతో..చాలా మంది పేరెంట్స్ పిల్లలు బాగా చదువుకుంటారన్న ఉద్దేశంతో లక్షల డబ్బులు పెట్టి చేర్చారు. దానికి వార్డెన్‌గా విజయ శంకర వర ప్రసాద్ అనే వ్యక్తిని నియమించింది స్కూల్ యాజమాన్యం. పేరుకు వార్డెన్. కానీ పని పక్కన పెడుతూ.. ఫూటుగా మద్యం సేవించడం.. హాస్టల్లోని విద్యార్థులతో వెకిలిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వారిని రప్పించి.. బట్టలు ఊడదీసి వికృత చేష్టలకు పాల్పడేవాడు.

మాట వినకపోతే.. భీభత్సంగా కొట్టేవాడు. ఇతడి ఆగడాలు రాను రాను మితిమీరిపోతుండటంతో.. తల్లిదండ్రులకు చెప్పారు కొంత మంది విద్యార్థులు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు పాఠశాలకు వెళ్లగా.. వార్డెన్ పరారయ్యాడు. అతడి గదిని తనిఖీ చేయగా.. తాగి పడేసిన మద్యం బాటిల్స్ కనిపించాయి. మద్యం దుకాణాన్ని తలపించేలా ఖాళీ సీసాలు దర్శనమిచ్చాయి. వార్డెన్ రూమ్ అంతా చిందర వందగా.. చాలా గలీజుగా కనిపించింది. విద్యార్థుల పట్ల వార్డెన్ ప్రవర్తించిన తీరు గురించి డీఈఓకి సమాచారం అందగా… స్కూల్ వద్దకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయం తెలిసిన స్థానిక విద్యార్థి సంఘ నాయకులు.. ఈ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Show comments