iDreamPost

ప్రయాణికులకు TGSRTC శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు

  • Published Jun 07, 2024 | 8:00 AMUpdated Jun 07, 2024 | 8:11 AM

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వారి కోసం ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. ధరలు భారీగా తగ్గించింది.

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వారి కోసం ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. ధరలు భారీగా తగ్గించింది.

  • Published Jun 07, 2024 | 8:00 AMUpdated Jun 07, 2024 | 8:11 AM
ప్రయాణికులకు TGSRTC శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు

ప్రయాణికులను ఆకర్షించడం కోసం ఇప్పటికే అనేక పథకాలు తీసుకువచ్చింది టీజీఎస్‌ఆర్టీసీ. ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అయితే ఏకంగా మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తోన​ సంగతి తెలిసందే. ఈ పథకం వల్ల రద్దీ పెరగడంతో.. దానికి తగ్గట్టుగా బస్సులను నడిపేందుకు కొత్త వాటిని కూడా కొనుగోలు చేస్తోంది. ఇక ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ పథకం ప్రారంభించిన తర్వాత.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య పెరడగంతో రద్దీతో పాటు ఆదాయం కూడా బాగానే పెరిగింది. ఇక మిగతా వర్గాల వారి కోసం కూడా టీజీఎస్‌ఆర్టీసీ అనేక రకాల పథకాలు తీసుకువస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. భారీగా ధరలు తగ్గించింది. ఆ వివరాలు..

హైదరాబాద్‌ నగరవాసులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బస్‌ పాస్‌ ధరలను భారీగా తగ్గించింది. అయితే అది సాధారణ బస్సుల్లో కాదు. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో టికెట్ ధరలను తగ్గించింది టీజీఎస్‌ఆర్టీసీ. ఈ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం నెలవారీ బస్‌ పాస్‌ ధరను తగ్గిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. కేవలం రూ.1900 కే ఈ బస్‌ పాస్‌ను సంస్థ అందజేస్తున్నట్లు ఆర్టీసీ సంస్థ తెలిపింది. ఇక గతంలో ఈ బస్‌ పాస్‌ ధర రూ.2530 ఉండగా.. ప్రయాణికుల కోసం తాజాగా ఆర్టీసీ సంస్థ దీనిపై ఏకంగా రూ.630 తగ్గించింది. ఇప్పుడు ఈ బస్‌ నెల వారి పాస్‌ ధర 1900 రూపాయలకు దిగి వచ్చింది.

ఈ బస్సు పాస్‌తో సికింద్రాబాద్ –పటాన్‌ చెరువు (219 రూట్), బాచుపల్లి – వేవ్ రాక్(195 రూట్) మార్గాల్లో నడిచే గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. అంతేకాక ఈ బస్‌పాస్‌తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులతో పాటు ఈ-మెట్రో ఎక్స్‌ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును కల్పించడం జరిగింది. అయితే ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో నడిచే పుష్ఫక్‌ ఏసీ బస్సుల్లో ఈ పాస్ చెల్లుబాటు కాదు.

అంతేకాక మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు పాస్ కలిగిన వారు రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని.. గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఒక ట్రిప్పులో ప్రయాణించవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్‌లోని టీజీఎస్‌ఆర్టీసీ బస్సు పాస్ కేంద్రాలలో ఈ పాస్‌లను సంస్థ జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. బస్‌ పాస్‌ ధర తగ్గించడం పై జనాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి