iDreamPost
android-app
ios-app

AP విద్యాసంస్కరణలను పరిశీలించిన తెలంగాణ అధికారులు!

AP విద్యాసంస్కరణలను పరిశీలించిన తెలంగాణ అధికారులు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణాలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విద్యావ్యవస్థలో నాడు-నేడు, అమ్మవడి వంటి అద్భుతమైన పథకాలను ప్రవేశ పెట్టాడు. అంతేకాక విద్యావిధానలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఏపీ విద్యావ్యస్థ గురించి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో కూడా చర్చలు వచ్చాయి. ఇలా ఏపీ విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ఆసక్తి చూపుతోంది. ఏపీ అమలు చేస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విధానాలను టీఎస్ అధికారులు పరిశీలించారు. ఆన్ లైన్ అటెండెన్స్, యాప్స్, డిజిటల్ టీచింగ్ విధానాన్ని తెలుసుకున్నారు.

గత నాలుగేళ్లుగా ఏపీ విద్యాశాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించి అనేక విజయాలు సాధించింది. విద్యార్థి దినచర్యలను పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి, ముఖ్యమంత్రి వరకు పరిసీలించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు పాఠశాల బయట పిల్లలను ట్రాక్ చేయడంలో ఏపీ ప్రభుత్వం విజయం సాధించింది. అలానే మధ్యాహ్న భోజనంలో అనేక మార్పులు తీసుకొచ్చి..పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తుంది. ఈ కార్యక్రమాల అమలు తీరును తెలంగాణ అధికారులు పరిశీలించారు.

ఇటీవలే  తెలంగాణ సమగ్ర శిక్ష అధికారులు ఏపీ వచ్చి.. ఇక్కడి అధికారులతో సమావేశమయ్యారు.  అలానే ఐటీ వినియోగంతో  సాధించిన విజయాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా పాఠశాలలు, విద్యార్థులు,టీచర్లను ఒక్కటి చేయడంపై ప్రత్యేకంగా అడిగారు. యాప్స్ ద్వారా విద్యార్థుల అటెండెన్స్ , ఉపాధ్యాలు హాజరును పేషియల్ రికగ్నిషన్ ద్వార నమోదు చేయడాన్ని అభినందించారు.  ఐటీ సంస్కరణలతో తక్కువ కాలంలోనే మంచి విజయాలు నమోదు  చేయడాన్ని తెలంగాణ అధికారులు అభిననందించారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రోజూ ప్రతి పాఠశాలను, ప్రతి విద్యార్థి పనితీరును తెసుకోవాడన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీటిలో కొన్నింటిని తమ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని నిర్ణయించారు.  గతంలో ఏపీ ప్రభుత్వం ‘మన బడి’, ‘నాడు-నేడు’ వంటి పథకాను ప్రవేశ పెట్టి.. సాధించిన విజయాన్ని పరిశీలించిన టీఎస్ అధికారులు.. అక్కడ కూడా ‘మన ఊరు-మన బడి’ పేరుతో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మరి. ఏపీ విద్యాసంస్కరణలను  తెలంగాణ అధికారులు తెలుసుకోవకడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఈ ప్రేమ అపురూపం.. కోనసీమలో సీఎం జగన్‌పై పూల వర్షం!