iDreamPost
android-app
ios-app

నారాయణ స్కూల్లో దారుణం.. కామాంధుడిగా మారిన ఉపాధ్యాయుడు

  • Published Feb 26, 2024 | 10:44 AM Updated Updated Feb 26, 2024 | 10:44 AM

పాఠశాలలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతోంది. విద్య నేర్పాల్సిన గురువులు సంస్కార హీనులుగా మారుతున్నారు. నారాయణ స్కూల్లో దారుణం వెలుగు చూసింది. ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారాడు.

పాఠశాలలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతోంది. విద్య నేర్పాల్సిన గురువులు సంస్కార హీనులుగా మారుతున్నారు. నారాయణ స్కూల్లో దారుణం వెలుగు చూసింది. ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారాడు.

  • Published Feb 26, 2024 | 10:44 AMUpdated Feb 26, 2024 | 10:44 AM
నారాయణ స్కూల్లో దారుణం.. కామాంధుడిగా మారిన ఉపాధ్యాయుడు

విద్యార్థులకు విద్యాబద్దులు నేర్పించి వారి భవిష్యత్తును బంగారు మయం చేసే ఉపాధ్యాయులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. కానీ నేడు కొంతమంది ఉపాధ్యాయులు చేసే వికృత చేష్టల వల్ల మొత్తం ఉపాధ్యాయ లోకానికే మచ్చ తెస్తోంది. స్కూల్లోని పిల్లలను సొంత బిడ్డల్లాగా భావించాల్సిన టీచర్స్ దారి తప్పుతున్నారు. సబ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. ఇదే రీతిలో ఓ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారాడు. ఓ విద్యార్థినిపై కన్నేసిన ఆ టీచర్ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.

ఇటీవలికాలంలో స్కూల్ విద్యార్థులపై లైంగిక దాడులు ఎక్కువై పోతున్నాయి. టీచర్లు, బస్ డ్రైవర్లు అమాయకుపు పిల్లలను మాయమాటలతో లోబర్చుకుంటున్న ఘటనలు చాలానే చోటుచేసుకుంటున్నాయి. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు అమలవుతున్నప్పటికీ కామాంధుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా విశాఖలో దారుణం చోటుచేసుకుంది. నారాయణ స్కూల్లో పీఈటీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న దుర్గా ప్రసాద్ అనే ఉపాధ్యాయుడు కామంతో కళ్లు మూసుకుపోయి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మాయమాటలతో నమ్మించి లోబర్చుకుని గర్భవతిని చేశాడు.

కొద్ది రోజుల నుంచి ఆ బాలిక అనారోగ్యంతో బాధపడుతుండడాన్ని గమనించిన ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆ బాలిక గర్భందాల్చిందని నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అసలు ఏం జరిగిందని తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయాన్ని పేరెంట్స్ తో చెప్పింది ఆ బాలిక. వెంటనే ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారిన నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş