iDreamPost
android-app
ios-app

HYD మెట్రోలో TDP ఓవరాక్షన్! బుద్ధి చెప్పిన ప్రయాణికులు!

  • Published Oct 14, 2023 | 4:09 PM Updated Updated Oct 14, 2023 | 4:50 PM
  • Published Oct 14, 2023 | 4:09 PMUpdated Oct 14, 2023 | 4:50 PM
HYD మెట్రోలో TDP ఓవరాక్షన్! బుద్ధి చెప్పిన ప్రయాణికులు!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్టును అన్యాయం అంటూ టీడీపీ తమ్ముళ్లు తెగ గగ్గోలు పెడుతున్నారు. అంతేకాక తరచూ టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు ఓవరాక్షన్ చేస్తుంటారు. గతంలో హైటెక్ సిటీ వద్ద వారు చేసిన హంగామా అందరికి తెలిసిందే. ఆ సమయంలో తోటి వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. తాజాగా హెద్రాబాద్ మెట్రో రైల్లో కూడా ఓవరాక్షన్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ పేరిట టీడీపీ ఓవరాక్షన్ చేసింది.మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తూ నిరసన కార్యక్రమం చేయాలని టీడీపీ భావించింది. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం మెట్రో రైళ్లు టీడీపీ కార్యకర్తలు ప్రయాణం చేశారు. టీడీపీ ఐటీ వింగ్ పేరుతో మెట్రో టీడీపీ నేతలు, కార్యకర్తలు అరుపులకు దిగారు. టీడీపీ వాళ్ల ఓవరాక్షన్ కి తోటి ప్రయాణికులు షాకి గురయ్యారు.  అంతేకాక టీడీపీ నేతలు చేసిన అరుపుల పట్ల తోటి ప్రయాణికులు అసహనం కూడా వ్యక్తం చేశారు. మెట్రో ట్రైన్ లో అరవడం పట్ల ఎటువంటి ఉపయోగం లేదని, ఎక్కడ అరవలో అక్కడ అరిస్తే బాగుంటుంది తప్ప.. ఇక్కడ చేస్తే  ఏం ప్రయోజనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఐటీ ఉద్యోగులు కొందరు మాత్రమే ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మెజార్టీ ఐటీ ఉద్యోగులు ఈ ప్రోగ్రామ్ కి దూరంగా ఉన్నారు. కేవలం టీడీపీ సానుభూతి పరులు మాత్రమే మెట్రోలో ఈ  రచ్చ చేసినట్లు తోటి ప్రయాణికులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ సానుభూతి పరుల ఓవరాక్షన్ పై  నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio