Dharani
ఆంధ్రప్రదేశ్ ఒంటిపూట బడులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తెలంగాణ కంటే ముందుగానే ఏపీలో ఒంటిపూట బడులు నిర్వహించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ఒంటిపూట బడులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తెలంగాణ కంటే ముందుగానే ఏపీలో ఒంటిపూట బడులు నిర్వహించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఆ వివరాలు..
Dharani
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటివారంలోనే మే నెలలో అన్నట్లుగా వేడి ఉంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విపరీతమైన ఎండ ఉంటుంది. ఆ సమమయంలో అడుగు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఇక పిల్లలు, వృద్ధులు ఈ ఎండలకు బయటకు రాకుండా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నిర్ణయం తీసుకోగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఈ క్రమంలో తాజాగా ఏపీలో ఒంటిపూట బడులకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు..
తెలంగాలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం అవుతాయని ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఏపీలో కూడా ఒంటిపూట బడులపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఎండలు మండిపోతుండడంతో విద్యార్థులు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని.. వెంటనే ఒంటిపూట బడులు నిర్వహించాలని ఎస్టీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం అందజేశారు. మార్చి 11వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం విద్యార్థుల క్షేమం గురించి ఆలోచించింది. ఒంటిపూట బడులపై వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
దాంతో పాటు మున్సిపల్ ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు వెంటనే చేపట్టాలని కోరారు. ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ల ఉద్యోగోన్నతి సమస్యను పరిష్కరించాలని.. 1వ తరగతి ప్రవేశ వయసు 6 ప్లస్ కాకుండా 5 ప్లస్‌గానే ఉండేలా చూడాలన్నారు. ప్రవేశ వయసు పెంచితే అడ్మిషన్లు తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. ఒంటిపూట బడులతో పాటుగా వేసవి సెలవులపై కూడా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పదో తరగతి పరీక్షలకు కేంద్రాలున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం నుంచి పూట బడులను నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. ఈ స్కూళ్లలో ముందుగా మధ్యాహ్నం భోజనం అందజేసి.. ఆ తర్వాత తరగతులు కొనసాగించనున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత..యథావిథిగా ఉదయం పూట తరగతులు నిర్వహిస్తారట. ఏపీలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 18న ప్రారంభంకానున్నాయి.
ఏపీ ప్రభుత్వం ఒంటిపూట బడులపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రతి ఏటా రెండు రాష్ట్రాల్లో దాదాపుగా ఒకేసారి ఒంటిపూట బడులు ప్రారంభించేవాళ్లు. కానీ ఈ ఏడాది ఏపీ ఒంటిపూట బడులకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. గతం కంటే ఈ సారి వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఒంటిపూట బడులపై నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ మొదలైంది. మరి ఏపీ ప్రభుత్వం ఒంటిపూట బడులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని చూడాలి.