iDreamPost
android-app
ios-app

అయోధ్య కోసం అనంతపురం చీర.. ప్రత్యేకలు ఇవే!

Dharmavaram Saree: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో అతిథులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఇదే సమయంలో అయోధ్య రామయ్యకు విలువైన కానుకలు కూడా వస్తున్నాయి.

Dharmavaram Saree: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో అతిథులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఇదే సమయంలో అయోధ్య రామయ్యకు విలువైన కానుకలు కూడా వస్తున్నాయి.

అయోధ్య కోసం అనంతపురం చీర.. ప్రత్యేకలు ఇవే!

కొన్ని వందల సంవత్సరాల కళ, కొన్ని కోట్ల మంది కల మరికొద్ది రోజుల్లో నిరవేరనుంది. త్రేతాయుగంలో అయోధ్యను ఏలిన రామయ్య తండ్రీ, తిరిగి ఇన్నేళ్ల తరువాత తన నగరంలో కొలువు దీరనున్నాడు. ఆయన ప్రాణప్రతిష్టకు అయోధ్య నగరం సర్వం సిద్ధమయ్యింది. ఇక రామయ్య ప్రాణప్రతిష్టా కార్యక్రమాన్ని చూసేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది.. వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక జనవరి 14 నుంచి అయోధ్య రామమందిరానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22వ తేదీన రాములోరు అయోధ్య నగరంలో కొలువుదీరనున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా రామభక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు.

అయోధ్య రామాలయంలో రాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వేడుక ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22వ తేదీన అయోధ్యలో రామాలయాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులు వివిధ రకాల కానులు స్వామి వారికి సమర్పిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇప్పటికే నేపాల్ ప్రాంతం నుంచి అయోధ్యాకు చాలా రకాల వెండీ వస్తువులు అయోధ్యకు వచ్చాయి. అలానే మన దేశంలోనే  వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు భక్తులు విలువైన కానుకలు ఇస్తూ రాములోరిపై తమ భక్తిని చూటుకుంటున్నారు.

గుజరాత్ కి చెందిన ఓ వ్యక్తి వజ్రాలతో కూడిన రామ మందిరాన్ని తయారు చేసి..రామ మందిర ట్రస్ట్ కి అందజేశారు. ఇలా ఎందరో తమ శక్తి సామర్థ్యం మేరకు రాముల వారికి కానుకులు అందజేస్తున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఓ చేనేత కార్మికుడు, తనదైన శైలిలో రామయ్యపై భక్తిని చాటుకున్నాడు. ఏకంగా లక్షన్నర రూపాయల ఖరీదు చేసే పట్టుచీరను సీతమ్మవారి కోసం తయారు చేశాడు. దీని కోసం అతడు ఏకంగా 4 నెలల పాటు కష్ట పడ్డాడు. ఇందులో విశేషం ఏమి ఉందని మీరు అనుకుంటే పొరపడినట్లే. ఈ చీర అతి సామాన్యమైన చీర కాదు. ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

చీర అంచులపై రామాయణంలోని వివిధ దృశ్యాల్ని పొందుపరిచాడు. పుత్రకామేష్టి యాగం నుంచి శ్రీరామపట్టాభిషేకం వరకు చాలా ఘట్టాల్ని ఈ చీర అంచుపై ఆ చేనేత కార్మికుడు నేయించాడు. ఇక చీర లోపల భాగంలో జై శ్రీరామ్ అనే రామయ్య నామాన్ని 322 సార్లు పొందుపరిచాడు. ఈ నామాలు తెలుగులోని కాకుండా 13 భాషల్లో ఉంటాయి. శ్రీరాముని ప్రాణప్రతిష్ట ప్రారంభోత్సవ కార్యక్రమం నాటికి ఈ చీరను అయోధ్యలో ట్రస్ట్ కు అందిస్తానని ఆ చేనేత కార్మికుడు తెలిపాడు. నేటి నుంటి ఆలయంలో ఏర్పాటుచేసిన 1008 మహాకుండ్ ల వద్ద ప్రత్యేక పూజలు  ప్రారంభమయ్యాయి.

దీనికోసం ఇప్పటికే 40వేల మందికి పైగా అర్చకులు అయోధ్యకు చేరుకున్నారు. ప్రాణప్రతిష్టకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఆలయ నిర్మాణం కోసం పునాదులు త్రవ్వినప్పుడు వెలికితీసిన మట్టిని ప్యాక్ చేసి అతిథులకు బహుమతిగా అందించబోతున్నారు. దీనికి రామ్ రాజ్ అనే పేరుపెట్టారు. మరి.. అయోధ్య రామయ్య కోసం దేశం నలుమూలల నుంచి ఇలా అనేక ప్రత్యేక కానుకలు వస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి