iDreamPost
android-app
ios-app

బాబాగా మారిన చంద్రబాబు! వరాలు ఇచ్చేస్తున్నాడుగా!

  • Published Aug 18, 2023 | 1:36 PM Updated Updated Aug 18, 2023 | 1:37 PM
  • Published Aug 18, 2023 | 1:36 PMUpdated Aug 18, 2023 | 1:37 PM
బాబాగా మారిన చంద్రబాబు! వరాలు ఇచ్చేస్తున్నాడుగా!

అయిపోయింది.. చంద్రబాబు పని పూర్తిగా అయిపోయింది.. ఈసారి ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం కాదు, ఆయన.. ఆయన ప్రియ పుత్రుడు లోకేష్‌ గెలిస్తే చాలు అన్నట్లుగా తయారయ్యింది పరిస్థితి. పార్టీ సంగతి ఏమో కానీ.. కొడుకు కోసం.. చంద్రబాబు.. ఏడు పదుల వయసులో కూడా.. కాళ్లకి బలపాలు కట్టుకుని మరీ తెగ తిరుగుతున్నారు. కానీ ఏం లాభం.. జనాలు మాత్రం బాబు గారిని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక​ చంద్రబాబు సభ అంటే.. బాబోయ్‌ ఆ భజన వినడం మా వల్ల కాదు అని ఆమడ దూరం పరిగెత్తుతున్నారు. జనాల నుంచి ఇలాంటి స్పందన ఊహించని చంద్రబాబు.. ఏం చేయాలో అర్థం కాక.. నోటికి ఏం వస్తే అది మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా బాబా అవతారం ఎత్తాడు చంద్రబాబు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై ఓ రేంజ్‌లో విమర్శలు వస్తున్నాయి.

ఇంతకు ఏం జరిగింది అంటే.. తాజాగా చంద్రబాబు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘రాఖీ పంపిస్తున్నాను.. 45 రోజులు పూజ గదిలో ఉంచి.. పూజ చేసిన రాఖీ మీకు పంపిస్తున్నాను. దాన్ని చేతుల్లోకి తీసుకుని.. ఒక్క సారి నన్ను తలుచుకుని.. మీ చేతికి కట్టుకుని.. మీకు వచ్చిన కష్టాలను ఊహించుకొండి. ఆ కష్టాలన్ని తీర్చే బాధ్యత భగవంతుడిది. ఆయన సంకల్పానికి నేను అండగా ఉంటానని మీకు తెలియజేస్తున్నాను’’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఏంటో బాబు గారు ఆఖరికి ఇలా బాబాగా మారిపోయారు.. ఇలాంటి మూఢనమ్మకాలు ఆచరించకూడదని చెప్పాల్సింది పోయి.. మీరే ఇలా మాట్లాడితే ఎలా.. 45 రోజుల చంద్ర బాబా వచ్చాడు అని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetgaranti girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Girişgrandpashabet giriş