iDreamPost
android-app
ios-app

జోధ్‌పుర్‌ ప్యాలెస్‌లో ఘనంగా షర్మిల కొడుకు పెళ్లి! పోటోలు వైరల్..

  • Published Feb 18, 2024 | 10:52 AM Updated Updated Feb 18, 2024 | 10:52 AM

YS Raja Reddy: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కుమారుడి పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆమె.. వాటికి కాస్తా విరామం ఇచ్చి.. కుమారుడి పెళ్లి వేడుకల్లో బిజీ అయ్యారు.

YS Raja Reddy: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కుమారుడి పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆమె.. వాటికి కాస్తా విరామం ఇచ్చి.. కుమారుడి పెళ్లి వేడుకల్లో బిజీ అయ్యారు.

  • Published Feb 18, 2024 | 10:52 AMUpdated Feb 18, 2024 | 10:52 AM
జోధ్‌పుర్‌ ప్యాలెస్‌లో ఘనంగా షర్మిల కొడుకు పెళ్లి! పోటోలు వైరల్..

ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ఘనంగా జరిగింది. శనివారం రాజస్థాన్ లోని జోధ్ పూర్ ప్యాలెస్ లో రాజారెడ్డి-ప్రియాల పెళ్లి వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం సందడిగా జరిగింది. ఇక తన కుమారుడి పెళ్లి వేడుకుల్లో భాగంగా నిర్వహించిన హల్దీ వేడుక ఫోటోలను షర్మిల సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతోన్న ఫోటోల్లో నూతన దంపతులు రాజారెడ్డి, ప్రియాలతో పాటు వైఎస్ విజయమ్మ, షర్మిల కుటుంబం, వధువు అట్లూరి ప్రియా తల్లిదండ్రులు కనిపించారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం ప్రియ అట్లూరితో అంగరంగ వైభవంగా జరిగింది. జోధ్‌పూర్ ప్యాలెస్‌లో రాజారెడ్డి, ప్రియ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. గత మూడు రోజులుగా రాజారెడ్డి పెళ్లికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు వివాహ వేడుకలు జరగనున్నాయి. అందులో భాగంగా 16వ తేదీన సంగీత్, మెహందీ కార్యక్రమం జరిగింది. అలానే 17వ తేదీ అయిన శనివారం సాయంత్రం రాజారెడ్డి, ప్రియలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సాక్షిగా ఒక్కటయ్యారు.

Sharmila's son's wedding

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు షర్మిల  సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.  అయితే పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు రాలేదు. ప్రస్తుతం రాజారెడ్డి హల్దీ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి16న ప్రారంభమైన మూడు రోజుల పెళ్లి వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఇప్పటికే రాజారెడ్డికి పెళ్లికి సంబంధించిన సంగీత్, మెహందీ, పెళ్లి వంటి కార్యక్రమాలు బంధువులు, సన్నిహితుల సమక్షంలో సందడిగా జరిగాయి. ఆదివారం తలంబ్రాలు, విందు కార్యక్రమాలు జరగనున్నాయి.

ఇక వైరల్ అవుతోన్న ఫోటోల్లో వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో నూతన వధూవరులు ముస్తాబై ఎంతో ఆకర్షణియంగా కనిపించారు. మిగిలినవారంతా పసుపు దుస్తుల్లో కనిపించారు. రాజా రెడ్డి, ప్రియలతో పాటు వారి తల్లిదండ్రులు ఈ ఫొటోలలో కనిపించారు. షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్, కూతురు అంజలి, వైఎస్ విజయమ్మ రాజా రెడ్డి వైపు నిల్చొన్నారు. అలానే ప్రియ అట్లూరి తల్లిదండ్రులు, ఆమె సోదరుడు మరోపక్క నిలబడి ఉన్న ఫొటో ఆకట్టుకుంటోంది. మరి.. వైరల్ అవుతోన్న షర్మిల కుమారుడి పెళ్లి ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom