ఒక్క ప్రమాదంతో వెలుగులోకి  రూ.7 కోట్ల నగదు! ఎక్కడటంటే..

ఎన్నికల వేళ  దేశ వ్యాప్తంగా భారీగా నగదు, విలువైన వస్తువులు, మద్యం బాటిళ్లు పట్టుబడుతోన్నాయి. అక్రమంగా తరలిస్తున్న డబ్బును, ఇతర వస్తువులను చెక్ పోస్టుల దగ్గర తనిఖీల్లో  పోలీసులు పట్టుకుంటున్నారు. తాజాగా ఓ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోట్ల రూపాయలు బయటపడ్డాయి.

ఎన్నికల వేళ  దేశ వ్యాప్తంగా భారీగా నగదు, విలువైన వస్తువులు, మద్యం బాటిళ్లు పట్టుబడుతోన్నాయి. అక్రమంగా తరలిస్తున్న డబ్బును, ఇతర వస్తువులను చెక్ పోస్టుల దగ్గర తనిఖీల్లో  పోలీసులు పట్టుకుంటున్నారు. తాజాగా ఓ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోట్ల రూపాయలు బయటపడ్డాయి.

ప్రస్తుతం  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అలానే మే 13న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల ప్రలోభానికి తెరలేపుతున్నాయి.  అక్రమంగా మద్యం, డబ్బులు  సరఫరా చేస్తున్నారు. ఇదేసమయంలో అధికారులు, పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. దీంతో ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా ఓ రోడ్డు ప్రమాద ఘటనలో కోట్ల రూపాయలు బయటపడ్డాయి. దీంతో ఓ కానిస్టేబుల్ భయపడి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. అసలు ఎక్కడ జరిగింది, ఆవివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఎన్నికల వేళ  దేశ వ్యాప్తంగా భారీగా నగదు, విలువైన వస్తువులు, మద్యం బాటిళ్లు పట్టుబడుతోన్నాయి. అక్రమంగా తరలిస్తున్న డబ్బును, ఇతర వస్తువులను చెక్ పోస్టుల దగ్గర తనిఖీల్లో  పోలీసులు పట్టుకుంటున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదును, మద్యాన్ని పట్టుకున్నారు. రెండు రోజుల క్రితమే వేల మద్యం బాటిళ్లను, వాటిని తరలిస్తున్న వారిని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. అలానే పలు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న నోట్ల కట్టలను పోలీసులు పట్టుకున్నారు. తాజాగా లేటెస్ట్ గా తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది.

తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ దగ్గర లారీ.. ఓ టాటా ఎస్ వాహనాన్ని ఢీ కొట్టింది. వేగంగా లారీ కొట్టడంతో ఆ వాహనం బోల్తాపడింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈప్రమాదం  జరిగింది. స్థానికులు గుర్తించి సమీపంలోని పోలీస్ స్టేషన్ సమాచారం అందించారు. దీంతో వెంటనే  ఘటనా స్థలానికి కానిస్టేబుల్ ఎస్. రవికుమార్ వచ్చారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని పరిశీలించగా భారీగా నగదు ఉన్నట్లు   గుర్తించారు.  వాహనంలో తరలిస్తున్న తౌడు బస్తాల మధ్యలో 7 బాక్సుల్లో డబ్బులు తరలిస్తున్నట్లు  కానిస్టేబుల్ గుర్తించారు.

ఇక వాహనంలో  ఒక్క సారిగా భారీగా నోట్ల కట్టలను చూసిన సదరు కానిస్టేబుల్ షాకి గురయ్యాడు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. దీంతో అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ  ఏడు బాక్సుల్లో ఉన్న డబ్బులను స్వాధీనం చేసుకుని వీరవళ్లి టోల్ ప్లాజా వద్దకు తరలించారు.  అక్కడ బయటకు తీసి లెక్కించారు. పట్టుబడిన నగదు మొత్తం దాదాపు రూ. 7 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.  వ్యాన్ డ్రైవర్ కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో కూడా  భారీగా నగదు పట్టుబడింది. అలానే కర్నాటకలో బళ్లారి ప్రాంతంలో కూడా అక్రమంగా తరలిస్తున్న డబ్బులు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Show comments