సీఎం జగన్ తో జబర్దస్త్ రియాజ్.. ఇది కదా నాయకుడి లక్షణం!

CM Jagan- Ring Riyaz: వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి ఈ ఐదేళ్లు వారికి అందించిన సంక్షేమం గురించి వివరిస్తున్నారు.

CM Jagan- Ring Riyaz: వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి ఈ ఐదేళ్లు వారికి అందించిన సంక్షేమం గురించి వివరిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో విజయమే లక్ష్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్విగ్నంగా కొనసాగుతోంది. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ.. వారికి ఈ ఐదేళ్లు అందించిన సంక్షేమం గురించి వివరిస్తూ జగన్ దూసుకుపోతున్నారు. ఈ బస్సు యాత్రకు ఏ జిల్లాకి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇసుక వేసినా రాలనంత జనం వస్తున్నారు. బస్సుయాత్రలో భాగంగా బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ బస్సు యాత్ర నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది. కావలిలో జగన్ బహిరంగ సభ కూడా నిర్వహించారు. అయితే ఈ యాత్రలో కావలిలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. గల్లీ బాయ్ రియాజ్ ను పక్కన కూర్చోబెట్టుకుని సీఎం జగన్ ఫొటో దిగారు.

గల్లీబాయ్ రియాజ్ కు బుల్లితెరలో ఉన్న పేరు, గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ సమయంలోనే ఒక మంచి కమెడియన్ గుర్తింపు పొందాడు. సామాజిక బాధ్యత కూడా కలిగిన రియాజ్ రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి చూపించాడు. అయితే జనసేన పార్టీ తరఫున ఈ సమాజానికి ఏదో చేసేయాలి అని చాలానే ఉత్సాహ పడ్డాడు. కానీ, అతను అనుకున్నది ఏదీ జరగలేదు. ఎందరో పెద్ద పెద్ద నేతలను, నమ్ముకున్న వారిని ఎలాగైతే జనసేన పార్టీ నట్టేట ముంచేసిందో రియాజ్ కు కూడా అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. మంచి చేయాలి అనే తపన ఉంటే సరిపోదు.. దానికి తగిన పార్టీని కూడా ఎంచుకోవాలి అని రియాజ్ తెలుసుకున్నాడు.

ప్రజల పక్షాన ఉండే పార్టీలో ఉంటే తాను అనకున్నది చేయగలనని రియాజ్ నమ్మాడు. వైసీపీలో చేరాడు. తాజాగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కావలిలో సీఎం జగన్ ని రియాజ్ కలిశాడు. రియాజ్ నిజానికి ఒక సామాన్య కార్యకర్త కావచ్చు.. కానీ, సీఎం జగన్ మాత్రం అతడిని ఆప్యాయంగా పలకరించడమే కాకుండా.. పక్కన కూర్చుబెట్టుకుని ఫొటో కూడా దిగారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేన పార్టీలో రియాజ్ అసలు ఉన్నాడో లేడో కూడా తెలుసుకోని పవన్ కు.. ఒక అభిమానిని, కార్యకర్తను అక్కున చేర్చుకున్న జగన్ కు ఉన్న తేడా ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కదా అసలైన నాయకుడి లక్షణం అంటూ ఈ ఫొటోని వైరల్ చేస్తున్నారు.

Show comments