iDreamPost
android-app
ios-app

లోకేష్‌పై RGV సెటైరు​.. ఆ మాత్రం తెలివి లేకపోతే ఎలా బేబీ అంటూ!

  • Published Oct 30, 2023 | 11:50 AM Updated Updated Oct 30, 2023 | 11:50 AM

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మకు, టీడీపీ నేత నారా లోకేష్‌కు మధ్య ట్విట్టర్‌ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. ఆమాత్రం తెలివి లేకపోతే ఎలా బేబీ అంటూ లోకేష్‌పై సెటర్లు వేశాడు ఆర్జీవీ. ఎందుకంటే..

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మకు, టీడీపీ నేత నారా లోకేష్‌కు మధ్య ట్విట్టర్‌ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. ఆమాత్రం తెలివి లేకపోతే ఎలా బేబీ అంటూ లోకేష్‌పై సెటర్లు వేశాడు ఆర్జీవీ. ఎందుకంటే..

  • Published Oct 30, 2023 | 11:50 AMUpdated Oct 30, 2023 | 11:50 AM
లోకేష్‌పై RGV సెటైరు​.. ఆ మాత్రం తెలివి లేకపోతే ఎలా బేబీ అంటూ!

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్టయ్యి.. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు హాట్‌ హాట్‌గా మారాయి. బాబు అరెస్టయ్యి నలభై రోజలకు పైనే అవుతోంది. అయితే దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా స్పందిస్తూ ట్వీట్‌ చేశాడు. ఫలితంగా ప్రస్తుతం ఆర్జీవీ, లోకేష్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

తొలుత ఆర్జీవీ.. చంద్రబాబు అరెస్ట్‌పై స్పందిస్తూ.. ఆయన లోపల.. నేను బయట అంటూ ట్వీట్‌ చేశాడు. దీనిపై.. నారా లోకేష్‌ తీవ్రంగా స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఆర్జీవీ ఏం చేశాడు అంటూ విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలపై స్పందించిన ఆర్జీవీ.. లోకేష్‌కు కౌంటర్ ఇస్తూ.. తన బెడ్రూం నుంచి మాట్లాడిన వీడియోని పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.

ఈవీడియోలో ఆర్జీవీ మాట్లాడుతూ.. లోకేష్‌ని చూసి జాలిపడాలా.. నవ్వాలా.. ఏం చేయాలో అర్థం కావట్లేదంటూ ఎద్దేవా చేశాడు. తనకు,ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏం సంబంధమంటూ ప్రశ్నించాడు. తాను సినిమాలు తీస్తానని.. అది తన వృత్తి అని చెప్పుకొచ్చాడు. అంతేకాక తానేమి చంద్రబాబులా.. జనాలకు సేవ చేయడానికి పుట్టాను.. తిరుగుతున్నాను.. చస్తాను.. అని ఎప్పుడైనా చెప్పానా బేబీ అంటూ లోకేష్‌ను స్వీట్‌గా ప్రశ్నించారు. తనను విమర్శించేందుకు ఆంధ్రప్రదేశ్‌ సేవ అనే అంశం తప్పితే వేరే ఏ టాపిక్ దొరకలేదా అని ప్రశ్నించారు. అంతేకాక తాను లోకేష్‌ స్థానంలో ఉంటే ఎలా విమర్శిస్తాడో.. స్వయంగా వివరించాడు ఆర్జీవీ.

‘‘వాడో పిచ్చోడు.. హిట్ ఇచ్చి చాలా రోజులు అయింది. పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తాడు. అడ్డదిడ్డమైన ట్వీట్స్ పెడతాడు. అలాంటి వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన పనిలేదు. పొద్దున లేచి పోర్న్ చూస్తాడు. వ్యక్తిత్వం లేని వాడు.. బాధ్యతారహితంగా తిరుగుతాడు. అలాంటి వ్యక్తిని అసలు పట్టించుకోవాల్సి అసరం లేదు అని చెప్పొచ్చు కదా. ఆ మాత్రం కూడా తెలివి లేకపోతే ఎట్లా బేబీ’’ అంటూ తనపై ఎలాంటి విమర్శలు చేయచ్చో కూడా స్వయంగా తనే చెప్పుకొచ్చాడు ఆర్జీవీ.

‘‘నా లైఫ్ ఓపెన్ బుక్. నీలాగా ఎక్కడో స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫోటోలను దాచేసి.. డ్రామాలు చేయను. చంద్రబాబు ప్రస్తుత పరిస్థితి చూసి నీకు మతి స్థిమితం కలిగిందేమో చూసుకో. మీ నాన్నని దేవుడు కూడా కాపాడలేడు. నిన్ను చూస్తే నాకు బాధ కలుగుతుంది. లండన్‌కో ఎక్కడికో వెళ్లి రెస్ట్ తీసుకొని మనసును శాంతపరుచుకుంటే మంచిది. నువ్వు హైరాన పడి ఏది పడితే అది మాట్లాడితే రాంగ్ సిగ్నల్ వెళుతుంది. నీ మంచి కోసం నేను చెప్తున్నా’’ అంటూ లోకేష్‌కు తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చాడు ఆర్జీవీ. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet