APలో ఎన్నికల తేదీ ప్రకటించిన EC! డేట్ ఎప్పుడంటే?

ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్.

ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్.

ఎన్నికల నగారా మోగింది. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణా చల్ ప్రదేశ్, సిక్కింకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు రాజీవ్ కుమార్. ఆయన తెలిపిన వివరాల ప్రకారం దేశంలో 49. 7 కోట్ల మంది పురుషులు., 47. 1 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1.8 కోట్ల మంది నూతన ఓటర్లు ఉన్నారు. 19.74 కోట్ల మంది యంగ్ ఓటర్స్ ఉన్నారు. ట్రాన్స్ జెండర్స్ 48 వేల మంది ఉన్నట్లు వెల్లడించారు. 85 ఏళ్లు పైబడిన వారు ఓటర్లు 82 లక్షల మంది. పీడబ్ల్యుహెచ్ 88.4 లక్షలు ఉన్నారు.  10.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాట్లు చేయనున్నారని తెలిపారు. ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికలు.. ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13న నాలుగో దశలో ఏపీ, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.

ఏపీ ఎన్నికల షెడ్యూల్

గెజిట్ నోటిఫికేషన్- ఏప్రిల్ 18

నామినేషన్లకు చివరి తేదీ- ఏప్రిల్ 25

ఉపసంహరణ – ఏప్రిల్ 29

ఎన్నికల తేదీ- మే 13

ఎన్నికల కౌంటింగ్- జూన్ 4

 

Show comments