iDreamPost
android-app
ios-app

వీడియో: వినాయక చవితి వేడుకల్లో అసభ్య నృత్యాలు!

Vinayaka Chavithi Festival News: దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలంతా భక్తిభావంతో గణేషుడిని పూజిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కొన్ని ప్రాంతాల్లో స్వామి వారి మండపాల్లో అశ్లీల నృత్యాలు చేస్తున్నారు.

Vinayaka Chavithi Festival News: దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలంతా భక్తిభావంతో గణేషుడిని పూజిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కొన్ని ప్రాంతాల్లో స్వామి వారి మండపాల్లో అశ్లీల నృత్యాలు చేస్తున్నారు.

వీడియో: వినాయక చవితి వేడుకల్లో అసభ్య నృత్యాలు!

దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో భక్తులు వివిధ రూపాల్లో గణనాథుడి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అన్నీ ప్రాంతాల్లో వినాయక మండపాల్లో స్వామి వారి భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా  చాలా మంది గణేషుడిని భక్తి శ్రద్దలతో కొలుస్తుంటే..మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. వినాయక చవితి వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారు. స్వామి వారి ముందే అశ్లీల న్యత్యాలు చేస్తూ..భక్తుల మనోభావాలు  దెబ్బతీస్తున్నారు. గతంలో అనేక సార్లు ఇలాంటివి జరగ్గా..పోలీసులు చర్యలు తీసుకున్నారు. తాజాగా తిరుపతి పట్టణంలోని ఓ ప్రాంతంలో మరోసారి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహాలు మండలపాల్లో కొలువు దీరాయి.  ఈ చవితి నవరాత్రులో స్వామి వారికి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో సప్తగిరి నగర్ లో ఆటో స్టాండ్ వద్ద కూడా వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. ఇక్కడి వినాయక మండపంలో రికార్డ్ డాన్స్ లు చేశారు. కొందరు యువతి యువకులు అశ్లీల నృత్యాలు చేస్తూ హడావుడి చేశారు. ఇలాంటి నృత్యాలు వినాయక మండపంలో చేయడంపై భక్తులు ఆశ్చర్యపరుస్తుంది. వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇలా ఏటా జరిగే వినాయక చవితి వేడుకల్లో పలు ప్రాంతాల్లో కొందరు అసభ్య కార్యక్రమాలు చేస్తున్నారు. గణేష్ మండపాల వద్ద అసభ్య నృత్యాలు చేయడం, మద్యం తాగడం వంటివి చేస్తున్నారు. చవితి రోజుల్లో నిత్యం ఉదయం, సాయంత్ర వేళలో వినాయక మండపాల వద్దకు భక్తులు వస్తుంటారు. వారికి భక్తి భావం పెంచే కార్యక్రమాలు నిర్వహించాలి.  అలా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అయితే కొందరు మాత్రం భక్తి భావాన్ని పక్కనే పెట్టే.. రికార్డింగ్ డ్యాన్సులు  ఏర్పాటు చేస్తున్నారు. గణేషుడిపై భక్తి కంటే.. ఎంజాయ్ చేయడానికి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. దీంతో అక్కడి వచ్చే భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. అసలు స్వామి వారి కార్యక్రమాల్లో ఇలాంటి డ్యాన్సులను నిషేధించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

అలానే గణేష్ మండపాల్లో  అశ్లీల నృత్యాల జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.  అయినా కూడా కొందకు కుక్క తోక వంకరు అన్నట్లు  ప్రవర్తిస్తున్నారు. తాజాగా తిరుపతి లోని సప్తగిరి నగరంలో ఓ మండపంలో అలానే జరిగింది. ఆ మండప నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇది ఇలా ఉంటే.. మరోవైపు వినాయకుడి నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.  పలు ప్రాంతాల్లో ఇప్పటికే గణనాథుడు  భక్తుల నుంచి వీడ్కోలు తీసుకుని గంగమ్మ ఒడికి చేరుతున్నాడు.   భక్తులు కూడా తమ బొజ్జ గణపయ్యాను ఘనంగా ఊరేగిస్తూ..గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఇలా వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతోన్నాయి.  మరి.. ఇలాంటి అశ్లీల కార్యక్రమాలకు పాల్పడే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.