Arjun Suravaram
Arjun Suravaram
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యం కోసం పెద్ద పీట వేస్తున్నారు. ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా వైద్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్య శ్రీ కింద అందించే వ్యాధుల చికిత్సల సంఖ్యను పెంచారు. ఇక తాజాగా చరిత్రలో నిలిచిపోయేలా ఓ అద్భుతమైన కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే పేరుతో వైద్యులను ప్రజల వద్దకే పంపుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ ద్వారా రాష్ట్రంలో పౌరులకు రికార్డు స్థాయిలో ఉచితంగా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 11వరకు రికార్డు స్థాయిలో మొత్తం 5,28,33,324(ఏడు రకాల) వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇటీవలే ఏపీ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా వైద్యులు ప్రజల వద్దకే వెళ్లి వారి ఆరోగ్య సమాచారం తెలుసుకుంటారు. అంతేకాక తీవ్రమైన వ్యాధులతో బాధ పడే వారిని గుర్తించి.. పెద్ద ఆస్పత్రులకు రిఫర్ కూడా చేస్తుంటారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఏఎన్‌ఎంలు, ప్రాంతీయ వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి ఆ ఇంట్లో వారికి ఆరోగ్య పరీక్షలు చేయడం ప్రారంభించారు. మరోవైపు, గత నెల 30వ తేదీ నుంచి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాలకు జనం భారీగా వచ్చి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకుంటున్నారు. ఇక జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వేలో మొత్తం ఏడు రకాల పరీక్షలు చేస్తున్నారు. బీపీ, షుగర్, మూత్ర, హిమోగ్లోబిన్, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఆరోగ్య శిబిరాలకు రాక ముందే పౌరుల ప్రొఫైల్‌తో కూడిన కేస్ షీట్‌ను ప్రింట్ చేసి ఇస్తున్నారు. అలాగే ఇంటింటి సర్వే రోగులకూ ఆరోగ్య శిబిరాల్లో కేస్ షీట్ ఇస్తున్నారు. వీరందరికీ ఆరోగ్య శిబిరాల్లో సీనియర్ వైద్యులు సేవలందిస్తున్నారు. మహిళా కోసం ప్రత్యేకంగా వైద్యురాల్లే సేవలందిస్తున్నారు. ఇక ఈ ప్రోగ్రామ్ తో ఈ ప్రోగ్రామ్ ద్వారా రాష్ట్రంలో పౌరులకు రికార్డు స్థాయిలో ఉచితంగా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 11వరకు రికార్డు స్థాయిలో మొత్తం 5,28,33,324 వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య శ్రీ కార్డుల్లేని అర్హులైనవారికి ఈ శిబిరాల్లోనే కార్డులు మంజూరు చేస్తున్నారు. అలానే జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో చికిత్సలకు వచ్చే వారి కోసం కుర్చీలు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. మరి.. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.