బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు(83) మరణించారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. రాజకీయ రంగలో సీనియర్ నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అనంతర రాజకీయ పరిణామాల వల్ల వైకాపాలో చేరారు కృష్ణంరాజు. ప్రస్తుతం వైకాపాలోనే కొనసాగుతున్నారు. ఇక కృష్ణంరాజు భార్య మల్లీశ్వరి టీటీడీ పాలకవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. కృష్ణంరాజు మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.