Rain Update August 29th 2023: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గినట్లే.. కానీ, అక్కడ మాత్రం!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గినట్లే.. కానీ, అక్కడ మాత్రం!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడ్డం రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. చాలా ప్రాంతాల్లో రోజు విడిచి రోజు అన్నట్లుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు వర్షాలే పడ్డం లేదు. దీనికి తోడు పగలు ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వాతావారణ శాఖ వర్షాలపై ఓ అప్‌డేట్‌ ఇచ్చింది. దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశలనుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని తెలిపింది. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని..

రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు ఈశాన్య జిల్లాల్లో ఉరములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఇక, హైదరాబాద్‌ నగరంలో కూడా చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం కనిపిస్తోందని అంది. ఉష్టోగ్రతలు కూడా గరిష్టంగా 34.1 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని తెలిపింది. నేడు, రేపు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్‌లో చిరు జల్లులనుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

రాయలసీమలో ఒకటి రెండు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుతుంటే.. ఉత్తరాదిన మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మొన్న హిమాచల్‌ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు భీభత్సం సృష్టించాయి. మరి, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments