Krishna Kowshik
ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రచారాల పర్వం హోరెత్తుతోంది. అధికార పక్షం, ప్రతిపక్ష కూటమి ఉదృతంగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. అలాగే కూటమిలో భాగమైన బీజెపీ నేతలు కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఏపీలో పర్యటిస్తున్నారు.
ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రచారాల పర్వం హోరెత్తుతోంది. అధికార పక్షం, ప్రతిపక్ష కూటమి ఉదృతంగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. అలాగే కూటమిలో భాగమైన బీజెపీ నేతలు కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఏపీలో పర్యటిస్తున్నారు.
Krishna Kowshik
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎలక్షన్స్ కూడా జరగనున్నాయి. ఇంకా ఎన్నికలకు కేవలం ఐదు రోజుల మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. విమర్శల, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ నెల 11తో ప్రచార పర్వానికి తెరపడనుంది. దీంతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ప్రధాన మంత్రి మోడీ. ఇఫ్పటికే దేశ వ్యాప్తంగా ప్రచారాల్లో పాల్గొంటున్న ఆయన ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఇక్కడ కూడా పర్యటిస్తున్నారు. రాజమండ్రి, అనకాపల్లి ప్రాంతాల్లో మోడీ పర్యటించి.. ప్రసంగించిన సంగతి విదితమే. ఏపీలో మరోసారి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రెడ్ జోన్ (నోఫ్లయింగ్ జోన్) ప్రకటించారు ఏపీ పోలీసులు
ఈ నెల 8న ప్రధాని మోడీ విజయవాడలో జరిగే ప్రచారానికి హాజరు కానున్నారు. ఈ క్రమంలో నగరమంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు. ఈ పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాన రోడ్లలో సరుకు రవాణా వాహనాలు, భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు సహా అన్ని వాహనాలను మళ్లించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు అలాగే ఓల్డ్ పీసీఆర్ జంక్షన్ నుండి బెంజి సర్కిల్ వరకు రెడ్ జోన్ అమలు చేశారు. రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర ఏరియాను నో ప్లయింగ్ జోన్‌గా నిర్ణయం తీసుకున్నారు. బుధవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుండి పీవీపీ మాల్ దగ్గరకు రోడ్డు మార్గంలో ప్రధాని చేరుకుని.. అక్కడ నుండి బెంజి సర్కిల్ వరకు 1.3 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహిస్తారు.
ఈ రోడ్ షోలో కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో రెండు కిలోమీటర్ల మేర నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించారు పోలీసులు. డ్రోన్లు, బెలూన్లు ఎగరేయడ నిషేధం, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్ షో ప్రాంతంలో కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. 5 వేల మందితో రూట్ బందోబస్తును ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల విభాగం, ఏపీఎస్పీ, పారా మిలటరీ బలగాలను మోహరించారు. అలాగే బందర్ రోడ్డు,ఏలూరు రోడ్డులో వాహనాలను మళ్లించారు. రేపు మోడీ పర్యటన ఉన్న బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ మార్గాల్లో వెళ్లకపోవడమే మంచింది. వాహనాలను కూడా మళ్లించే ఏర్పాట్లను పూర్తి చేశారు పోలీసులు.