iDreamPost
android-app
ios-app

నన్ను లైంగికంగా వేధిస్తున్నారు: నారాయణపై మరదలు ఫిర్యాదు

  • Published Feb 12, 2024 | 9:16 PM Updated Updated Feb 12, 2024 | 9:16 PM

Ponguru Priya: మాజీ మంత్రి పొంగూరు నారాయణపై ఆయన మరదలు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక నెల్లూరు జిల్లా ఎస్సీకి సైతం నారాయణపై ఆమె ఫిర్యాదు చేశారు. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా ఆమె..

Ponguru Priya: మాజీ మంత్రి పొంగూరు నారాయణపై ఆయన మరదలు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక నెల్లూరు జిల్లా ఎస్సీకి సైతం నారాయణపై ఆమె ఫిర్యాదు చేశారు. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా ఆమె..

  • Published Feb 12, 2024 | 9:16 PMUpdated Feb 12, 2024 | 9:16 PM
నన్ను లైంగికంగా వేధిస్తున్నారు: నారాయణపై మరదలు ఫిర్యాదు

మాజీ మంత్రి పొంగూరు నారాయణపై ఆయన మరదలు ప్రియ తరచూ అనేక వ్యాఖ్యలు చేస్తుంటారు. నారాయణ అనేక అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారంటూ ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. నారాయణ ఒక ఉమనైజర్, అతడిని ఎవరు నమ్మొద్దంటూ ఆమె గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.  సొంత కుటుంబ సభ్యులనే వేధిస్తున్న నారాయణను నెల్లూరు ప్రజలు నమ్మి మోసపోవద్దని చెప్పింది. ఇంట్లో ఆడవాళ్లని నారాయణ టార్చర్ పెడతాడు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా మరోసారి నారాయణ విషయంలో పొంగూరి ప్రియా వార్తల్లో నిలిచారు

సోమవారం పొంగూరు ప్రియా నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిని కలిశారు. పొంగూరు నారాయణపై ప్రియా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనను నారాయణ లైంగికంగా వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, తనను పిచ్చిదానిలా క్రియేట్ చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎస్పీకి ఫిర్యాదు చేసే ముందు ప్రియ ఇంటి వద్ద కాస్తా హైడ్రామా చోటుచేసుకుంది. నారాయణపై ఫిర్యాదు చేసందుకు వెళ్తున్న ప్రియను ఇంటి వద్ద ఆమె భర్త మణి, ఇతర కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అయితే వారి చెర నుంచి తప్పించుకుని మరీ.. ప్రియ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

అంతకుముందు ముందు ప్రియ ఇంటి వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. నారాయణపై  ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న ప్రియను ఇంటి వద్ద ఆమె భర్త మణి, ఇతర కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. వీరి చెర నుంచి తప్పించుకుని మరీ ప్రియ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.  గతంలో కూడా నారాయణ గురించి ప్రియా అనే విషయాలను వెల్లడించారు. పెళ్లైన రెండో రోజు నుంచే బావ నారాయణ లైంగిక వేధింపులు మొదలు పెట్టడాని, ఆయనకు లొంగకపోవడంతో 29 ఏళ్లుగా వారు పెట్టే బాధలు భరిస్తున్నాని చెప్పుకొచ్చారు. ఆయన స్త్రీలోలుడు అంటూ చెప్పుకొచ్చింది.నారాయణ విద్యా సంస్థల్లో పని చేసే కొందరు మహిళలు ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే. ఇలా గతంలో నారాయణపై ప్రియా అనేక ఆరోపణలు చేసింది. తాజాగా తనపై లైంగిక వేధిస్తున్నారంటూ ఆమె తాజాగా ఫిర్యాదు  చేశారు. మరి.. తాజాగా పొంగూరు ప్రియా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş