ప్రశాంత్ కిషోర్ డెకాయిట్ అన్న నోటితోనే.. సాయం కోరుతున్న చంద్రబాబు!

Prashanth Kishor: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతోన్నాయి.

Prashanth Kishor: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతోన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పొలిటికల్ పరిణామాలు ఊహించని మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అధికార వైసీపీ కూడా 2024లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఈ సారి ఆయన టీడీపీ కోసం పనిచేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో పీకే జగన్ నేతృత్వంలోని వైసీపీ కోసం పనిచేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో చంద్రబాబు, ప్రశాంత్  మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరిగింది. తాజాగా వారిద్దరి మధ్య జరిగిన భేటీపై కొందరు సెటైర్లు వేస్తున్నారు.

2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పని చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. టార్గెట్ చేసి తిట్టిన వారిలో ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ విషయంలో చంద్రబాబు దూకుడు మరీ దారుణంగా ఉండేది. 2019 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు..ప్రశాంత్ కిషోర్ ను బీహార్ డెకాయిట్ అంటూ, అక్కడి రాజకీయాలు ఇక్కడ పని చేయవు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలా కేవలం ఎన్నికల ముందే కాకుండా.. ఆ తర్వాత కూడా వైసీపీతో పాటు ప్రశాంత్ కిశోర్ పై  చంద్రబాబు నోరుపారేసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం తనకు ఉందని పదే పదే చెప్పుకునే బాబు.. హుందాతనం గురించి ఎప్పటికప్పుడు క్లాసులు పీకే బాబు.. ఇలా అసలు రాజకీయాలతో ఊగిపోవడం హాస్యాస్పదం.

ఇక ప్రశాంత్ కిషోర్ విషయానికి వస్తే.. ఆయన కేవలం పార్టీలకు రాజకీయ వ్యూహాలు అందించే వారు. అది కూడా అన్నీ ఉద్యోగాల మాదిరిగానే అది కూడా ఓ వృత్తి. తనదైన వ్యూహాలతో ప్రశాంత్ పలు పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. 2019లో జరిగిన ఏపీ ఎన్నికల తర్వాత కూడా పలు రాష్ట్రాల్లో పీకే రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. అలా వ్యూహాలు రచించే వారికి, రాజకీయ నాయకుల మధ్య ఉన్న చిన్న గీతను దాటి చంద్రబాబు పీకేపై వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా తాను ఎవరిపై అయితే నోరు పారేసుకున్నారో అదే వ్యక్తి వద్దకు వెళ్లారు.

రాజకీయ వ్యూహాలు రచించడంలో పీకే దిట్ట అనే విషయం,  ఆయనకు ఉన్న నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకేనేమో.. చంద్రబాబు తిట్టిన నోటితోనే తన గెలుపు కోసం సాయం చేయమని కోరేందుకు వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది.  2024లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో, సీఎం జగన్ చేతిలో మరోసారి ఓడిపోతానేమో అనే భయంతో అవకాశం ఉన్న అన్ని దారులను చంద్రబాబు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పీకేతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇలా బీహార్ డెకాయిట్ అంటూ తిట్టిన నోటితోనే చంద్రబాబు పీకేని వెళ్లి కలవడంతో ఇదేమి ఖర్మ బాబు అంటూ నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు..తాను చేసిన పరిపాలనపై నమ్మకం లేక.. తాను తిట్టిన వ్యక్తి వద్దకే వెళ్లి సాయం కోరుతున్నారు. ఇది..చంద్రబాబుకు నిజంగా ఖర్మే అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి.. ప్రశాంత్ కిశోర్ చంద్రబాబు భేటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments