iDreamPost
android-app
ios-app

వీడియో: మెగాస్టార్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన కలెక్టర్!

  • Published Jan 16, 2024 | 12:00 PM Updated Updated Jan 16, 2024 | 12:00 PM

సంక్రాంతి వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అలానే ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ కలెక్టర్ మెగాస్టార్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు.

సంక్రాంతి వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అలానే ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ కలెక్టర్ మెగాస్టార్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు.

  • Published Jan 16, 2024 | 12:00 PMUpdated Jan 16, 2024 | 12:00 PM
వీడియో: మెగాస్టార్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన కలెక్టర్!

హిందూ సంప్రదాయాలకు, సంస్కృతులకు ప్రతీక సంక్రాంతి పండగ. ఇక ఈ వేడుకను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లి..తమదైన రీతిలో సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. ఇక కొత్త కోడళ్లు, అల్లుళ్ళతో  అందరి కుటుంబాలు సందడి సందడిగా ఉంటాయి.  సంక్రాంతి పండగ వేళ గ్రామాల్లో, పట్టణాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఫ్యాషన్  షో, ఆటలు, డ్యాన్సులు వంటి అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ.. మకర సంక్రాంతి వేడుకలను ఎంజాయ్ చేస్తారు.  ఈ సంబరాల్లో అధికారులు సైతం పాల్గొన్ని అందరిని ఆకట్టుకుంటారు. తాజాగా ఓ కలెక్టర్ మెగాస్టార్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసి.. సూపబ్బ్ అనిపించారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. పచ్చన్ని తోరణాలతో ప్రతి గడప ముందు పండగ సందడి  కనిపించింది. రంగులతో ఊరువాడలు ముస్తాబై.. చూపరులను ఆకట్టుకున్నాయి. సొంత ఊళ్లకు వెళ్లిన వారు తమదైన స్టైల్ లో సంక్రాంతి వేడుకలను చేసుకున్నారు. పిండివంటలు, గాలి పటాలు, కోడి పందేలతో సంబరాలు మిన్నంటాయి. పిల్లలు, పెద్దలతు డ్యాన్సుల చేస్తూ..తెగ ఎంజాయ్ చేశారు. ఇక ఈ వేడుకలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సైతం పాల్గొన్ని అందరిని ఆకట్టుకుంటున్నారు. భోగి రోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు స్టెప్పులేసి ఔరా అనిపించారు. అంతేకాక తాను పండగ వేళ సంబరాల రాంబాబునేనని, తరువాత అసలైన రాజకీయ నాయకుడనని తనదైన స్టైల్లో చెప్పారు.

ఇక తాజాగా పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. నర్సరావు పేటలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కలెక్టర్ శివశంకర్ పాల్గొన్నారు. అంతేకాక స్టేజ్ పై స్టెప్పులేసి అదరగొట్టారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోని  పాటకి కలెక్టర్ చిందులేసి ఆకట్టకున్నారు. ప్రొఫెషనల్  డ్యాన్సర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా కలెక్టర్  డ్యాన్స్ చేశారు. కలెక్టర్ శివశంకర్ టాలెంట్ చూసి అక్కడి వారు  ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. కలెక్టర్ వేసిన మాస్ స్టెప్పులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet