iDreamPost
android-app
ios-app

APలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. DSCపై మంత్రి బొత్స కీలక ప్రకటన

  • Published Jan 13, 2024 | 7:50 PM Updated Updated Jan 13, 2024 | 8:07 PM

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు భారీ శుభవార్త. పండగ వేళ ఏపీ మంత్రి ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. నిరుద్యోగులకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు భారీ శుభవార్త. పండగ వేళ ఏపీ మంత్రి ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. నిరుద్యోగులకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

  • Published Jan 13, 2024 | 7:50 PMUpdated Jan 13, 2024 | 8:07 PM
APలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. DSCపై మంత్రి బొత్స కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు భారీ శుభవార్త. పండగ వేళ ఏపీ మంత్రి ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. నిరుద్యోగులకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సంక్రాంతి పండగ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆయన ప్రకటించారు. డీఎస్సీపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో చర్చలు జరిపినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. త్వరలో డీఎస్సీ ఖాళీల వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు. పోస్టులు, డీఎస్సీ నిర్వహణపై సంబంధిత అధికారులతో కసరత్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటనతో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో వివిధ శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 1 ద్వారా పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలో వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతుండడంతో ఆశావాహులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి బొత్స డీఎస్సీ నోటిఫికేషన్ సంక్రాంతి తర్వాత విడుదల చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet