P Krishna
ఈ మద్య అగ్ని ప్రమాదాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. షార్ట్ సర్య్కూట్, ఇతర కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతున్నాయి.
ఈ మద్య అగ్ని ప్రమాదాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. షార్ట్ సర్య్కూట్, ఇతర కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతున్నాయి.
P Krishna
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. కరెంట్ షాక్, మానవ తప్పిదాలు ఇతర కారణాల వల్ల ఈ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని అధికారులు అంటున్నారు. కారణాలు ఏవైనా అగ్నిప్రమాదాల వల్ల భారీ ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కెమికల్ ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద గోదాములు, మాల్స్, బాణా సంచా ఫ్యాక్టరీల్లో ఫైర్ సెఫ్టీ ఉండాలని ప్రభుత్వం సూచించినా.. కొంతమంది నిర్లక్ష్యం వహిస్తుంటారు. సరైన సమయానికి ఫైర్ ఆపకపోవడంతో పెద్ద ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా దుగ్గిరాలలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో తీవ్ర కలకలం రేపింది. శుభం మహేశ్వరి కూలింగ్ గిడ్డంగిలో శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల వాళ్లు భయంతో వణికిపోయి పరుగులు తీశారు. భారీ మంటలు, పొగతో ఊపిరి పీల్చుకోవడానికి ఉక్కిరి బిక్కిరి అయ్యారు. వెంటనే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రి సమయంలో కావడంతో చుట్టు పక్కల ప్రజలు పోగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంటలు బాగా పెరిగిపోవడంతో విజయవాడ నుంబచి మరో వాహనం తెప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుననామని అగ్నిమాపక అధికారి షేక్ జిలానీ అన్నారు. గిడ్డంగిలో కొన్ని వేల బస్తాల పసుపు ఉన్నట్లు తెలుస్తుంది. కోట్లలో నష్టం వాటిల్లనట్లు యజమాని శ్యామ్ మహేశ్వర్ కన్నీరు పెట్టుకున్నారు.