iDreamPost
android-app
ios-app

శ్రీవారి మెట్ల మార్గంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం! చివర్లో ట్విస్ట్..

  • Published Aug 23, 2024 | 6:04 PM Updated Updated Aug 23, 2024 | 6:04 PM

Lovers Incident At Tirumala: శుక్రవారం తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇందులో చివర్లో ఊహించని ట్విస్ట్ జరిగింది.

Lovers Incident At Tirumala: శుక్రవారం తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇందులో చివర్లో ఊహించని ట్విస్ట్ జరిగింది.

  • Published Aug 23, 2024 | 6:04 PMUpdated Aug 23, 2024 | 6:04 PM
శ్రీవారి మెట్ల మార్గంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం! చివర్లో ట్విస్ట్..

ప్రేమ.. చూడటానికి చాలా చిన్న పదమే..కానీ పవర్ మాత్రం మాములుగా ఉండదు. దీని మాయలో పడిన మనిషి ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడతాడు. ఇంకా చెప్పాలంటే..ప్రేమ మైకంలో చావడానికైనా, చంపడానికైనా సిద్దపడే వారు ఉన్నారు. అందుకే నేటికాలంలో జరుగుతున్న ఘోరాల్లో ప్రేమ కారణంగా జరిగేవి ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో ఓ వివాహిత, మరో యువకుడు పురుగులు మందు తాగారు. మెట్లమార్గంలోని 450వ మెట్టు ఆ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి వెంటనే టీటీడీ అధికారులు సమాచారం ఇచ్చారు. టీటీడీ సిబ్బంది వెంటనే స్పందించి… ఆ ఇద్దరినీ వేగంగా కిందకు దించారు. అనంతరం అప్పటికే రెడీగా ఉంచిన అంబులెన్సులో రుయా ఆస్పత్రికి తరలించారు.

ఇక సూసైడ్ కి యత్నించిన ఆ జంట చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లెకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇక పోలీసుల విచారణలో ఊహించని ట్విస్టులు తెలిశాయి. ఆత్మహత్యకు యత్నించిన మహిళ వయస్సు పాతికేళ్లు కాగా.. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన సతీష్ అనే 19 ఏళ్ల యువకుడితో మహిళ ప్రేమలో పడినట్లు తెలిసింది. ఇద్దరూ పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇక భర్త, పిల్లలను వదిలేసి.. ఆ మహిళ, యువకుడు మూడు రోజుల క్రితం పారిపోయారు. ఈ మూడు రోజుల పాటు పలుచోట్ల తిరిగారు. మరి ఏం జరిగిందో ఏమో కానీ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పురుగుల మందు తీసుకుని శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్లారు.

అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. విషయం తెలిసిన ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు శ్రీవారిమెట్టు వద్దకు చేరుకున్నారు. ఇద్దరిని టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సాయంతో ఆ భర్తే.. రుయా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరిలో ప్రియుడు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే భక్తులు తిరిగే శ్రీవారిమెట్టు మార్గంలో ఈ ఘటన జరగడం అందరిని కలవర పాటుకు గురి చేస్తుంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss