Arjun Suravaram
YS Jagan: కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం..... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి సభలో చెప్పే మాటలు. అయితే వీటిపై ప్రతిపక్షాలు అనేక అసత్యా ఆరోపణలు చూశాయి. వారి నోర్లు మూయించేలా కుమారి ఆంటీ చేసిన వ్యాఖ్యలు నిలిచాయి.
YS Jagan: కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం..... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి సభలో చెప్పే మాటలు. అయితే వీటిపై ప్రతిపక్షాలు అనేక అసత్యా ఆరోపణలు చూశాయి. వారి నోర్లు మూయించేలా కుమారి ఆంటీ చేసిన వ్యాఖ్యలు నిలిచాయి.
Arjun Suravaram
నాయకుడు అనే వాడు పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పాలన సాగించాలి. అలా ఏ లీడర్ అయితే సంక్షేమ ఫలాలలు అందరికి అందిస్తారో..వారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. తమకు ఓటు వేయలేదని, లేకుంటే ఇతర కారణాలతో అర్హులన వారికి అన్యాయం చేస్తే..అలాంటి నాయకుడిపై ప్రజలకు విశ్వసనీయత ఉండదు. అలానే మనం ధర్మ బద్ధంగా పాలన సాగిస్తే.. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన.. ప్రజలే సమాధానం చెప్పి.. వారి నోర్లు మూసిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విపక్షాలు చేసిన ఆరోపణల విషయంలో అదే జరిగింది. పార్టీలకు అతీతంగా తన పాలన సాగుతుందని అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే సీఎం జగన్ చెప్పారు. అందుకు నిదర్శనం కుమారి ఆంటీ చేసిన వ్యాఖ్యలు.
సాయి కుమారి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. కారణం.. స్ట్రీడ్ ఫుడ్ ను ఏర్పాటు చేసి కుమారి ఆంటీ ఫేమస్ అయ్యారు. ఇక మీడియా ఆమెను వరుస పెట్టి ఇంటర్వ్యూలు చేయడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. ఆమె ఎంత ఫేమస్ అయ్యారో.. ఆమె చుట్టూ అన్నే వివాదాలు చేరాయి. ఇటీవలే ఆమె ఫుడ్ స్టాల్ ను ట్రాఫిక్ పోలీసులు తొలగించడం.. ఈ ఇష్యూపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా స్పందించడం జరిగింది. ఆమె ఫుడ్ స్టాల్ ను తిరిగి తెరచుకోవచ్చని సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆఅంతేకాక త్వరలో కుమారి ఫుడ్ స్టాల్ ను సందర్శిస్తానని సీఎంవో ఆఫీస్ నుంచి సమాచారం వచ్చింది. కుమారి ఆంటీ ఇష్యూను కొందరు రాజకీయ వివాదంగా క్రియేట్ చేశారు.
ఇక ఆమెకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. తనకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్లే ఆస్తి అని చెప్పుకొచ్చింది. అలానే ఆమెకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిస్పక్షపాత పాలనకు నిదర్శనంగా నిలిచాయి. ఓ వీడియోలో కుమారీ ఆంటీ చెబుతూ.. తనకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి.. టీడీపీకే వేస్తున్నానని తెలిపింది. తమ కుటుంబం మొత్తం టీడీపీకే వేటు వేశామని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు తమ ఓటును చంద్రబాబు నాయుడికే వేశామని కుమారి ఆంటీ తెలిపింది. అలానే కొన్ని రోజుల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్లే ఉందని చెప్పింది. ఇక ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి.
తమకు ఓటు వేయని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం లేదని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు చేసింది. అంతేకాక టీడీపీకి ఓటు వేసిన వారికి పెన్షన్లు, ఇతర ప్రభుత్వ స్కీమ్స్ తొలగించారంటూ అనేక పనికిమాలిన ఆరోపణలు చేసింది. వారందరికి చెంప దెబ్బకొట్టేలా కుమారి ఆంటీ వ్యాఖ్యలు నిలిచాయి. ఆమె ఎప్పటి నుంచి ఓటు టీడీపీకే వేస్తున్నట్లు స్వయంగా చెప్పింది. అలానే సీఎం జగన్ కారణంగా తనకు సొంత ఇళ్లు అని చెప్పింది. ఇంతకంటే నిదర్శనం ఏమి ఉంటాది.. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిస్పక్షపాత పాలనకు అంటూ చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్దికి కృషి చేస్తున్నారు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడం అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక సభల్లో చెప్పారు. కేవలం ప్రభుత్వ పథకాలు అర్హులైతే చాలని.. వారు ఏ పార్టీకి చెందిన వారికైన లబ్ధి అందిస్తామని ఆయన చెప్పారు. కేవలం నిజాయితీ, అవినీతి రహితంగా, పేదల సంక్షేమమే ధ్యేయంగా తన పాలన సాగిస్తావని ఎన్నో సభలో సీఎం జగన్ చెప్పారు.
సీఎం జగన్.. కులం,మతం, ప్రాంతం చూడమని చెప్పాడు.. అలానే అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందిలా చేశారు. అందుకు నిదర్శనం తాజాగా కుమారి ఆంటీ చేసిన వాఖ్యలు. సీఎం జగన్ పాలనకు.. కుమారి ఆంటీ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలా సీఎం జగన్ పార్టీలకు అతీతంగా, అన్ని వర్గాల వారికి, తనకు ఓటు వేయకున్న కూడా పథకాలను అందించాడు. ఇది కదా నిజమైన నాయకుడి లక్షణం, నిస్పక్షపాతమైన పాలన అంటూ ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి..కుమారి ఆంటీ చెప్పిన మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మాకు ఓటు వేయనివారైనా సరే, If that man is eligible for welfare Scheme, they should be given.
For us, this is politics, and we are very proud of our leader @ysjagan. Can you say the same in regard to your leader @JaiTDP?#EndOfTDP#YSJaganAgain https://t.co/vni6KAEY8T pic.twitter.com/1HuFutOuZd
— YSR Congress Party (@YSRCParty) January 31, 2024